Ekkadivaadulu neegu niddariginela povu

ఎక్కడివాదులు నీకు నిద్దరికినేల పోవు
Language

(॥పల్లవి॥)
ఎక్కడివాదులు నీకు నిద్దరికినేల పోవు
ముక్కుపై వేలిడుకొంటే ముచ్చటలు మానునా

(॥ఎక్కడి॥)
పలుకకుండఁగ నీతోఁ బలుమారుఁ గొసరుచు
సొలసేటి పతిదిక్కు చూడరాదా
తలయెత్తకుండినా తలఁపులో నాతని
నిలువెల్ల ధ్యానమై నీలోనఁ బాసునా

(॥ఎక్కడి॥)
చెనకి కోపించఁగాను చెరఁగువట్టి తీసేటిఁ
ననుపులపతితోడ నవ్వవద్దా
తనువు ముట్టనీకున్న తగనాతనిసొమ్ములు
పెనగొని నీమేనఁ బెట్టితివి గాదా

(॥ఎక్కడి॥)
చెక్కు చేతనుండఁగానె చెలి కాఁగిలించెనిదె
పక్కన శ్రీవేంకటేశుఁ బైకొనరాదా
అక్కర నీవూరకున్న నాతఁడే నినుఁగూడె
మక్కువలు దాఁచినాను మర్మములు రేఁచవా

(||pallavi||)
ĕkkaḍivādulu nīgu niddariginela povu
mukkubai veliḍugŏṁṭe muchchaḍalu mānunā

(||ĕkkaḍi||)
palugaguṁḍam̐ga nīdom̐ balumārum̐ gŏsarusu
sŏlaseḍi padidikku sūḍarādā
talayĕttaguṁḍinā talam̐pulo nādani
niluvĕlla dhyānamai nīlonam̐ bāsunā

(||ĕkkaḍi||)
sĕnagi kobiṁcham̐gānu sĕram̐guvaṭṭi tīseḍim̐
nanubulabadidoḍa navvavaddā
tanuvu muṭṭanīgunna taganādanisŏmmulu
pĕnagŏni nīmenam̐ bĕṭṭidivi gādā

(||ĕkkaḍi||)
sĕkku sedanuṁḍam̐gānĕ sĕli kām̐giliṁchĕnidĕ
pakkana śhrīveṁkaḍeśhum̐ baigŏnarādā
akkara nīvūragunna nādam̐ḍe ninum̐gūḍĕ
makkuvalu dām̐sinānu marmamulu rem̐savā