ఎక్కడినుండి వచ్చితి వే వూరే నీవు
(॥పల్లవి॥)
ఎక్కడినుండి వచ్చితి వే వూరే నీవు
చుక్కబొట్టు వెట్టుకొని సుద్దులు చెప్పేవు
(॥ఎక్క॥)
ఎప్పటినుండి సరసాలాడేవు నా పతితోను
చెప్పనే నీ వెవ్వతెవు చెలియా
కొప్పు నిక్కఁబెట్టితివి కొనలు వెళ్ళముడిచి
పిప్పిగట్ట విడేలు పెదవిపైఁ జేసేవు
(॥ఎక్క॥)
కలసి నామగనితోఁ జుట్టరికాలు సేసేవు
తెలుపవే నీగుట్టు తెల్లమిగాను
పలచఁగా మేనుమిండాఁ బసవు వూసుకొంటివి
వలిపెము గట్టి నీ భావములు చూపేవు
(॥ఎక్క॥)
యిట్టె నన్నేలే శ్రీవేంకటేశుతోనే నవ్వేవు
యెట్టిదో నీ దీమసము యెంచవే నాతో
పట్టితివి పిడికిట బాగాలూ దెల్లనాకులు
నెట్టనఁ జెవిఁ బునుఁగు నిండా నించుకొంటివి
(||pallavi||)
ĕkkaḍinuṁḍi vachchidi ve vūre nīvu
sukkabŏṭṭu vĕṭṭugŏni suddulu sĕppevu
(||ĕkka||)
ĕppaḍinuṁḍi sarasālāḍevu nā padidonu
sĕppane nī vĕvvadĕvu sĕliyā
kŏppu nikkam̐bĕṭṭidivi kŏnalu vĕḽḽamuḍisi
pippigaṭṭa viḍelu pĕdavibaim̐ jesevu
(||ĕkka||)
kalasi nāmaganidom̐ juṭṭarigālu sesevu
tĕlubave nīguṭṭu tĕllamigānu
palasam̐gā menumiṁḍām̐ basavu vūsugŏṁṭivi
valibĕmu gaṭṭi nī bhāvamulu sūbevu
(||ĕkka||)
yiṭṭĕ nannele śhrīveṁkaḍeśhudone navvevu
yĕṭṭido nī dīmasamu yĕṁchave nādo
paṭṭidivi piḍigiḍa bāgālū dĕllanāgulu
nĕṭṭanam̐ jĕvim̐ bunum̐gu niṁḍā niṁchugŏṁṭivi