Ekkadimaadalu yemti visaaramu

ఎక్కడిమాటలు యేఁటి విచారము
Language

(॥పల్లవి॥)
ఎక్కడిమాటలు యేఁటి విచారము
చిక్కక హరినే సేవించవలదా

(॥ఎక్కడి॥)
బొందితోఁ జేసినపుణ్యము లన్నియు
గొందిఁ జచ్చి మఱి కుడిచేదటా
కంది కుంది తా గడియించిన ధన
మంది సుతులపా లయ్యేదటా

(॥ఎక్కడి॥)
బిరుదుశాస్త్రమునఁ బెండ్లియాడినసతి
మరలిపుట్టువున మఱి వేరట
పెరిమ బహుగతులఁ బెంచుకొన్న తను
వరయఁగఁ దనవెంట నరుగదట

(॥ఎక్కడి॥)
చెలఁగి యిచ్చి యార్జించిన కీరితి
పిలిచే యాజన్మపుపేరిది యట
బలిమి శ్రీవేంకటపతి యంత కాత్మ
గలఁడని కొలిచినఁ గలుగును ఫలము

(||pallavi||)
ĕkkaḍimāḍalu yem̐ṭi visāramu
sikkaga harine seviṁchavaladā

(||ĕkkaḍi||)
bŏṁdidom̐ jesinabuṇyamu lanniyu
gŏṁdim̐ jachchi maṟi kuḍisedaḍā
kaṁdi kuṁdi tā gaḍiyiṁchina dhana
maṁdi sudulabā layyedaḍā

(||ĕkkaḍi||)
biruduśhāstramunam̐ bĕṁḍliyāḍinasadi
maralibuṭṭuvuna maṟi veraḍa
pĕrima bahugadulam̐ bĕṁchugŏnna tanu
varayam̐gam̐ danavĕṁṭa narugadaḍa

(||ĕkkaḍi||)
sĕlam̐gi yichchi yārjiṁchina kīridi
pilise yājanmabuberidi yaḍa
balimi śhrīveṁkaḍabadi yaṁta kātma
galam̐ḍani kŏlisinam̐ galugunu phalamu