Ekkadigim bonamduvu yevvade namtanamduvu

ఎక్కడికిఁ బోనందువు యెవ్వతె నంటనందువు
Language

(॥పల్లవి॥)
ఎక్కడికిఁ బోనందువు యెవ్వతె నంటనందువు
గుక్కక తారుకాణించుకొందు గాని రావయ్యా

(॥॥)
మదిమదినుండి నీతో మాటలాడిన ఫలము
కదిసి యింతటిలోనే కంటిమయ్యా
అదివో ఆపెఁ దిట్టితినంటాఁ జెప్పితివట
కొద లేకుండాఁ దెలుపుకొందువు రావయ్యా

(॥॥)
చక్కజాడ నీతోడ సరసమాడిన ఫల-
మిక్కడనే నాకు ఫలియించె నయ్యా
మొక్కలపాపెవని నీముందల వట్టితినని
అక్కడ నంటివట నీవాడుకొందు రావయ్యా

(॥॥)
పొంచి నీకాఁగిటఁ గూడి పొందుసేసిన పలము
వంచన లేక సరివచ్చెనయ్యా
యెంచి శ్రీవేంకటేశ నీకిడిన తమ్ములమాకె-
కుంచుమంటి నన్నది రూపించవలె రావయ్యా

(||pallavi||)
ĕkkaḍigim̐ bonaṁduvu yĕvvadĕ naṁṭanaṁduvu
gukkaga tārugāṇiṁchugŏṁdu gāni rāvayyā

(||||)
madimadinuṁḍi nīdo māḍalāḍina phalamu
kadisi yiṁtaḍilone kaṁṭimayyā
adivo ābĕm̐ diṭṭidinaṁṭām̐ jĕppidivaḍa
kŏda leguṁḍām̐ dĕlubugŏṁduvu rāvayyā

(||||)
sakkajāḍa nīdoḍa sarasamāḍina phala-
mikkaḍane nāgu phaliyiṁchĕ nayyā
mŏkkalabābĕvani nīmuṁdala vaṭṭidinani
akkaḍa naṁṭivaḍa nīvāḍugŏṁdu rāvayyā

(||||)
pŏṁchi nīgām̐giḍam̐ gūḍi pŏṁdusesina palamu
vaṁchana lega sarivachchĕnayyā
yĕṁchi śhrīveṁkaḍeśha nīgiḍina tammulamāgĕ-
kuṁchumaṁṭi nannadi rūbiṁchavalĕ rāvayyā