Ekkadigekkada marumdeligada yinnidigi

ఎక్కడికెక్కడ మరుఁడేలికట యిన్నిటికి
Language

(॥పల్లవి॥)
ఎక్కడికెక్కడ మరుఁడేలికట యిన్నిటికి
యిక్కువల నూతఁగూట మెట్టు గూడెనే

(॥ఎక్క॥)
కొలనిలో తుమ్మిదలు కొంతలలో చల్లగాని
చెలరేఁగి పలికేటిచిలుకగుంపు
ములువాఁడివిరులును మొయిలులోనమెఱుఁగు
యెలమి నూరఁగూట మెట్టుగూడెనే

(॥ఎక్క॥)
కావరపుచందురుఁడు కడువేఁడివెన్నెలలు
చేవమీరినట్టి లేఁతచిగురులును
పావురపుఁబలుకులు బలువసంతునిడాక
యీవిధాన నూరఁగూట మెట్టు గూడెనే

(॥ఎక్క॥)
చిమ్మిరేఁగేవలపులు చెఱకుసింగిణివిల్లు
తెమ్మలకోరికలపొలదికరతులు
కొమ్మయలమేలుమంగఁ గూడె శ్రీవేంకటేశుఁడు
యెమ్మెల నూగఁగూటము లెట్టు గూడెనే

(||pallavi||)
ĕkkaḍigĕkkaḍa marum̐ḍeligaḍa yinniḍigi
yikkuvala nūdam̐gūḍa mĕṭṭu gūḍĕne

(||ĕkka||)
kŏlanilo tummidalu kŏṁtalalo sallagāni
sĕlarem̐gi paligeḍisilugaguṁpu
muluvām̐ḍivirulunu mŏyilulonamĕṟum̐gu
yĕlami nūram̐gūḍa mĕṭṭugūḍĕne

(||ĕkka||)
kāvarabusaṁdurum̐ḍu kaḍuvem̐ḍivĕnnĕlalu
sevamīrinaṭṭi lem̐tasigurulunu
pāvurabum̐balugulu baluvasaṁtuniḍāga
yīvidhāna nūram̐gūḍa mĕṭṭu gūḍĕne

(||ĕkka||)
simmirem̐gevalabulu sĕṟagusiṁgiṇivillu
tĕmmalagorigalabŏladigaradulu
kŏmmayalamelumaṁgam̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
yĕmmĕla nūgam̐gūḍamu lĕṭṭu gūḍĕne