Ekkadi vubaayamula ne munnadi

ఎక్కడి వుపాయముల నే మున్నది
Language

(॥పల్లవి॥)
ఎక్కడి వుపాయముల నే మున్నది
మొక్కె నీ కొక్కనికే మూలము నీవే

(॥ఎక్కడి॥)
పరులను శిక్షించి పనిగొనియెద నా
సిరుల నా శరీరము శిక్షించ లేను
వరుస లోకమింతాను వసముచేసుకొనేనా
పరగ నా మతి స్వస్థపరచుకో లేను

(॥ఎక్కడి॥)
నిక్కము నన్యదేము నే ననుభవించేనా
పక్కన నా యాత్మ ననుభవించ లేను
అక్కడా నిక్కడా ధన మడిగి కూడపెట్టెనా
అక్కటా నా విజ్ఞాన మార్జించ లేను

(॥ఎక్కడి॥)
బట్టబాయిట నే దేవపట్టములు సాధించేనా
యిట్టి తపోరాజ్య మేలఁగ లేను
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
పుట్టుగు లందేనా నీపై బుద్ధి మాన లేను

(||pallavi||)
ĕkkaḍi vubāyamula ne munnadi
mŏkkĕ nī kŏkkanige mūlamu nīve

(||ĕkkaḍi||)
parulanu śhikṣhiṁchi panigŏniyĕda nā
sirula nā śharīramu śhikṣhiṁcha lenu
varusa logamiṁtānu vasamusesugŏnenā
paraga nā madi svasthabarasugo lenu

(||ĕkkaḍi||)
nikkamu nanyademu ne nanubhaviṁchenā
pakkana nā yātma nanubhaviṁcha lenu
akkaḍā nikkaḍā dhana maḍigi kūḍabĕṭṭĕnā
akkaḍā nā vijñāna mārjiṁcha lenu

(||ĕkkaḍi||)
baṭṭabāyiḍa ne devabaṭṭamulu sādhiṁchenā
yiṭṭi taborājya melam̐ga lenu
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
puṭṭugu laṁdenā nībai buddhi māna lenu