Ekkadi valabu salle vemee neevu

ఎక్కడి వలపు చల్లే వేమీ నీవు
Language

(॥పల్లవి॥)
ఎక్కడి వలపు చల్లే వేమీ నీవు
చెక్కిట నున్నచేయి చెప్పీఁ గదవయ్యా

(॥ఎక్క॥)
వెన్నెలరాతిరులలో వేడుక లాడితిమంటా
యెన్నటిసుద్దులు చెప్పే వేమీ నీవు
నిన్న మొన్నఁ గానము నీ వెవ్వరు నేనెవ్వరు
అన్నియునుఁ బాఁతమర పాయఁగదవయ్యా

(॥ఎక్క॥)
భావమరఁదల మంటా పట్టపగ లేడనైన
యేవూరివావులు చెప్పే వేమి నీవు
నీవు దొరవైతివి నిజ మేది కల్ల యేది
కావరా లన్నియుఁ దొంటి కత లాయనయ్యా

(॥ఎక్క॥)
వోడక చంద్రవంకలు వున్న వెక్కడనో యంటా
యేడ గురుతులు చెప్పి వేమీ నీవు
కూడితి శ్రీవేంకటేశ గొబ్బన నిట్ల నన్ను
జాడలిన్నాళ్లకు నేఁడు చవులాయ నయ్యా

(||pallavi||)
ĕkkaḍi valabu salle vemī nīvu
sĕkkiḍa nunnaseyi sĕppīm̐ gadavayyā

(||ĕkka||)
vĕnnĕlarādirulalo veḍuga lāḍidimaṁṭā
yĕnnaḍisuddulu sĕppe vemī nīvu
ninna mŏnnam̐ gānamu nī vĕvvaru nenĕvvaru
anniyunum̐ bām̐tamara pāyam̐gadavayyā

(||ĕkka||)
bhāvamaram̐dala maṁṭā paṭṭabaga leḍanaina
yevūrivāvulu sĕppe vemi nīvu
nīvu dŏravaidivi nija medi kalla yedi
kāvarā lanniyum̐ dŏṁṭi kada lāyanayyā

(||ĕkka||)
voḍaga saṁdravaṁkalu vunna vĕkkaḍano yaṁṭā
yeḍa gurudulu sĕppi vemī nīvu
kūḍidi śhrīveṁkaḍeśha gŏbbana niṭla nannu
jāḍalinnāḽlagu nem̐ḍu savulāya nayyā