ఎక్కడి తారుకాణలు యేల రట్టు సేసేవు
(॥పల్లవి॥)
ఎక్కడి తారుకాణలు యేల రట్టు సేసేవు
వొక్క మనసాయ నిఁక నూరకుండవయ్యా
(॥ఎక్క॥)
ముందు నీ వాపెతో నేల ముచ్చట లాడితివంటే
అందుకుఁ దగ్గట్టే వుపాయాలు చెప్పేవు
చెంది నే నమ్మనంటే ఆచెలినే తోడితెచ్చేవు
యెందుకు వేగిరకాఁడ వేమి సేతునయ్యా
(॥ఎక్క॥)
అట్టె వద్ద నుండఁగాను ఆపె నడుగఁగఁ బోతే
నెట్టన నడ్డా లందుకు నీవే వచ్చేవు
గుట్టు వెళ్లవేసితే గొబ్బనఁ జెక్కు నొక్కేవు
యెట్టునుఁ బోరాదు నీతో నేమి సేతునయ్యా
(॥ఎక్క॥)
సొలసి నీమేన నున్నచొప్పు లరయఁ జూచితే
కలయఁ దలఁచి నన్నుఁ గాఁగిలించేవు
కలట్టాన వెట్టుమంటే కళలంటి చొక్కించితిఁ
వెలమి శ్రీవేంకటేశ యేమి సేతునయ్యా
(||pallavi||)
ĕkkaḍi tārugāṇalu yela raṭṭu sesevu
vŏkka manasāya nim̐ka nūraguṁḍavayyā
(||ĕkka||)
muṁdu nī vābĕdo nela muchchaḍa lāḍidivaṁṭe
aṁdugum̐ daggaṭṭe vubāyālu sĕppevu
sĕṁdi ne nammanaṁṭe āsĕline toḍidĕchchevu
yĕṁdugu vegiragām̐ḍa vemi sedunayyā
(||ĕkka||)
aṭṭĕ vadda nuṁḍam̐gānu ābĕ naḍugam̐gam̐ bode
nĕṭṭana naḍḍā laṁdugu nīve vachchevu
guṭṭu vĕḽlaveside gŏbbanam̐ jĕkku nŏkkevu
yĕṭṭunum̐ borādu nīdo nemi sedunayyā
(||ĕkka||)
sŏlasi nīmena nunnasŏppu larayam̐ jūside
kalayam̐ dalam̐si nannum̐ gām̐giliṁchevu
kalaṭṭāna vĕṭṭumaṁṭe kaḽalaṁṭi sŏkkiṁchidim̐
vĕlami śhrīveṁkaḍeśha yemi sedunayyā