Ekkadi puraakrtamu yemi seseeni

ఎక్కడి పురాకృతము యేమి సేసీని
Language

(॥పల్లవి॥)
ఎక్కడి పురాకృతము యేమి సేసీని
యెక్కడా బలువు నీ బం ట్లెట్టుండినాఁ జెల్లును

(॥ఎక్కడి॥)
నీ వల్లఁ బుట్టెను బ్రహ్మ నీవు సేసినదే మాయ
భావించి నీ కుక్షిలోనే బ్రహ్మాండాలూ
కావింప నీ వేలికవు కమ్మని నట్టౌఁ బనులు
దైవమా యిది యెఱిఁగి నీ దాసుఁడనేనైతిని

(॥ఎక్కడి॥)
భూమి నీ దేవులు నీవు పుట్టించిన దమృతము
శ్రీమంతుఁడ విన్నిటా నీ సేసినట్టవును
యేమిటివాఁడు యముఁడు యెక్కడి మృత్యువు మరి
సామజవరద మీ శరణు చొచ్చితిని

(॥ఎక్కడి॥)
ఏడఁ జూచినా నీ దాసు లెక్కడాఁ జెడుట లేదు
యీడు లేదు శ్రీ వేంకటేశ నీకును
యేడ విధి యేడ స్వర్గ మెక్కడిది నరకము
జాడతో నీముద్ర నా భుజముల ధరించితి

(||pallavi||)
ĕkkaḍi purākṛtamu yemi sesīni
yĕkkaḍā baluvu nī baṁ ṭlĕṭṭuṁḍinām̐ jĕllunu

(||ĕkkaḍi||)
nī vallam̐ buṭṭĕnu brahma nīvu sesinade māya
bhāviṁchi nī kukṣhilone brahmāṁḍālū
kāviṁpa nī veligavu kammani naṭṭaum̐ banulu
daivamā yidi yĕṟim̐gi nī dāsum̐ḍanenaidini

(||ĕkkaḍi||)
bhūmi nī devulu nīvu puṭṭiṁchina damṛtamu
śhrīmaṁtum̐ḍa vinniḍā nī sesinaṭṭavunu
yemiḍivām̐ḍu yamum̐ḍu yĕkkaḍi mṛtyuvu mari
sāmajavarada mī śharaṇu sŏchchidini

(||ĕkkaḍi||)
eḍam̐ jūsinā nī dāsu lĕkkaḍām̐ jĕḍuḍa ledu
yīḍu ledu śhrī veṁkaḍeśha nīgunu
yeḍa vidhi yeḍa svarga mĕkkaḍidi naragamu
jāḍado nīmudra nā bhujamula dhariṁchidi