ఎక్కడి పరాకు నీకు నెందాఁకాను
(॥పల్లవి॥)
ఎక్కడి పరాకు నీకు నెందాఁకాను
చక్కని రమణి కిట్టు చనవియ్యవయ్యా
(॥॥)
సానఁబట్టినచూపులు చల్లఁగా నీపైఁ జల్లి
తేనెలమాటలెల్లా నొద్దికతో ముంచె
కానుక సెలవినవ్వు కప్పురముగా నిచ్చె
మానవతి నిఁకనైన మన్నించవయ్యా
(॥॥)
సరి చన్నులు మీఁదెత్తి సమ్మతిఁ గాచుకున్నది
యిరవై చెమటపన్నీ రిదివో నించె
మురిపెపుసిగ్గులనే ముగ్గులు నీకుఁ బెట్టె
తరుణి నింతట నిట్టె దయఁజూడవయ్యా
(॥॥)
నిండుజవ్వనపాయమే నిలువు సేసలు వెట్టి
దండిసరసపుఁదమి దయిలువోసె
అండనె శ్రీవేంకటేశ అన్నిటా నేలితివి
మెండైనవనిత నింకా మెప్పించవయ్యా
(||pallavi||)
ĕkkaḍi parāgu nīgu nĕṁdām̐kānu
sakkani ramaṇi kiṭṭu sanaviyyavayyā
(||||)
sānam̐baṭṭinasūbulu sallam̐gā nībaim̐ jalli
tenĕlamāḍalĕllā nŏddigado muṁchĕ
kānuga sĕlavinavvu kappuramugā nichchĕ
mānavadi nim̐kanaina manniṁchavayyā
(||||)
sari sannulu mīm̐dĕtti sammadim̐ gāsugunnadi
yiravai sĕmaḍabannī ridivo niṁchĕ
muribĕbusiggulane muggulu nīgum̐ bĕṭṭĕ
taruṇi niṁtaḍa niṭṭĕ dayam̐jūḍavayyā
(||||)
niṁḍujavvanabāyame niluvu sesalu vĕṭṭi
daṁḍisarasabum̐dami dayiluvosĕ
aṁḍanĕ śhrīveṁkaḍeśha anniḍā nelidivi
mĕṁḍainavanida niṁkā mĕppiṁchavayyā