Ekkadi paraagu lemtigayaa

ఎక్కడి పరాకు లేఁటికయా
Language

(॥పల్లవి॥)
ఎక్కడి పరాకు లేఁటికయా
గక్కునఁ గాఁగిటఁ గలయఁగరాదా

(॥॥)
ననుపునఁ జెలి యదె నవ్వులు నవ్వీ
వెనకటి పొందులు వెసఁ దలచి
చెనకుచు నీపైఁ జేఁతలు సేసీ
మనసులోన నీ మర్మము దలఁచి

(॥॥)
తగిలిన యాసలఁ దప్పక చూచీ
పొగరుమోవి తీపులు దలఁచి
మిగులఁ దఱచుగా మేలము లాడీ
వెగటులేని రతివేడుక దలచి

(॥॥)
ఘనమగు చన్నులఁ గడు నిను నొరసీ
వొనరిన నీ చనవులు దలఁచి
యెనసెను శ్రీవేంకటేశ్వర నిన్నీ కె
గొనకొను నీమంచిగుణములు దలఁచి.

(||pallavi||)
ĕkkaḍi parāgu lem̐ṭigayā
gakkunam̐ gām̐giḍam̐ galayam̐garādā

(||||)
nanubunam̐ jĕli yadĕ navvulu navvī
vĕnagaḍi pŏṁdulu vĕsam̐ dalasi
sĕnagusu nībaim̐ jem̐talu sesī
manasulona nī marmamu dalam̐si

(||||)
tagilina yāsalam̐ dappaga sūsī
pŏgarumovi tībulu dalam̐si
migulam̐ daṟasugā melamu lāḍī
vĕgaḍuleni radiveḍuga dalasi

(||||)
ghanamagu sannulam̐ gaḍu ninu nŏrasī
vŏnarina nī sanavulu dalam̐si
yĕnasĕnu śhrīveṁkaḍeśhvara ninnī kĕ
gŏnagŏnu nīmaṁchiguṇamulu dalam̐si.