Ekkadi maayaamrga mela temmamti nenu

ఎక్కడి మాయామృగ మేల తెమ్మంటి నేను
Language

(॥పల్లవి॥)
ఎక్కడి మాయామృగ మేల తెమ్మంటి నేను
అక్కడ నా వల్లనే యపరాధ మనువిూ

(॥ఎక్కడి॥)
రాముఁడెన్నఁ డిందు వచ్చు రావణు నెన్నఁడు చంపు
నీమాట హనుమంత నిజమా యిది
యేమని నన్నుఁ దలఁచు యెట్ల నున్నాఁడు తాను
ఆమాటే యింకొక్కపరి అడిగేఁ జెప్పుమా

(॥ఎక్కడి॥)
యెటువలెఁ బొద్దు వేగు నినకులేశ్వరునకు
నీటున నన్నుఁ బాసిననాటనుండి
కటకట తన్నుఁ బాసి కంటి నే నిన్నియును
యిటువలె దైవ మాయ యింత నన్నుఁ జేసెఁగా

(॥ఎక్కడి॥)
వుంగరము పుత్తెంచెను వున్నదిగా కృప నాపై
కంగిన పగెల్లా నీఁగి కైకొనె నన్ను
కంగుగ శ్రీవేంకటాద్రి రఘపపతి నన్నుఁ గూడె
యింగితాన నయాధ్య యేలెఁగా యిప్పుడు

(||pallavi||)
ĕkkaḍi māyāmṛga mela tĕmmaṁṭi nenu
akkaḍa nā vallane yabarādha manuviూ

(||ĕkkaḍi||)
rāmum̐ḍĕnnam̐ ḍiṁdu vachchu rāvaṇu nĕnnam̐ḍu saṁpu
nīmāḍa hanumaṁta nijamā yidi
yemani nannum̐ dalam̐su yĕṭla nunnām̐ḍu tānu
āmāḍe yiṁkŏkkabari aḍigem̐ jĕppumā

(||ĕkkaḍi||)
yĕḍuvalĕm̐ bŏddu vegu ninaguleśhvarunagu
nīḍuna nannum̐ bāsinanāḍanuṁḍi
kaḍagaḍa tannum̐ bāsi kaṁṭi ne ninniyunu
yiḍuvalĕ daiva māya yiṁta nannum̐ jesĕm̐gā

(||ĕkkaḍi||)
vuṁgaramu puttĕṁchĕnu vunnadigā kṛpa nābai
kaṁgina pagĕllā nīm̐gi kaigŏnĕ nannu
kaṁguga śhrīveṁkaḍādri raghabapadi nannum̐ gūḍĕ
yiṁgidāna nayādhya yelĕm̐gā yippuḍu