Ekkadi kemgidivani yemi sesevani

ఎక్కడి కేఁగితివని యేమి సేసేవని
Language

(॥పల్లవి॥)
ఎక్కడి కేఁగితివని యేమి సేసేవని
చక్కని సతులు నిన్ను సాదించరా

(॥ఎక్క॥)
చిందరవందరలనీచెక్కులచెమట చూచి
ఇందు నెవ్వరైనా నిన్నుఇదేమనరా
గందుపుబేంట్లు చూచి కందినబుజాలు చూచి
మందెమేళమున ననుమానించరా

(॥ఎక్క॥)
కన్నులకావులు చూచి కాఁకలవాదులు చూచి
నిన్ను వాడవారిఁగూడ నిందలెంచరా
చిన్నిపులకలు చూచి చింద్రికెమోవి చూచి
సన్నల నిన్నాడవారు సారె నవ్వరా

(॥ఎక్క॥)
నీకుఁ గానరాదుగాక నీమేనిపచ్చి చూచి
మే కొవి ఇంటివారు కొడిమెలు గట్టరా
యీకడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడి నీవు
వాకిట నుండినఁ జూచి వదనము నొక్కరా

(||pallavi||)
ĕkkaḍi kem̐gidivani yemi sesevani
sakkani sadulu ninnu sādiṁcharā

(||ĕkka||)
siṁdaravaṁdaralanīsĕkkulasĕmaḍa sūsi
iṁdu nĕvvarainā ninnuidemanarā
gaṁdububeṁṭlu sūsi kaṁdinabujālu sūsi
maṁdĕmeḽamuna nanumāniṁcharā

(||ĕkka||)
kannulagāvulu sūsi kām̐kalavādulu sūsi
ninnu vāḍavārim̐gūḍa niṁdalĕṁcharā
sinnibulagalu sūsi siṁdrigĕmovi sūsi
sannala ninnāḍavāru sārĕ navvarā

(||ĕkka||)
nīgum̐ gānarādugāga nīmenibachchi sūsi
me kŏvi iṁṭivāru kŏḍimĕlu gaṭṭarā
yīgaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍi nīvu
vāgiḍa nuṁḍinam̐ jūsi vadanamu nŏkkarā