Ekkadi kekkadi suddu lemanevuraa

ఎక్కడి కెక్కడి సుద్దు లేమనేవురా
Language

(॥పల్లవి॥)
ఎక్కడి కెక్కడి సుద్దు లేమనేవురా
వొక్కమారే యింతసేయ వొద్దు వొద్దురా

(॥ఎక్క॥)
మాటలనే కరఁగితి మన్ననకే పెరిగితి
యీటునఁ గోపించనేర నేమిసేతురా
నీటున నివ్వెరగైతి నెయ్యానకే పొరుగైతి
నేఁటికి నన్నొరసేవు యేడకేడరా

(॥ఎక్క॥)
చింతలనే జునిఁగితి సిగ్గులనే మునిఁగితి
ఇంతలోనే పిలిచేవు యేమందురా
పంతానకే పాలైతిఁ బాయానకే లోనైతి
యెంతకెంత సారె నిన్ను నెచ్చరింతురా

(॥ఎక్క॥)
కాఁకలనే తనిసితి కాఁగిట నే నెనసితి
వాకున నన్నుఁ బొగడవలెనటరా
పైకొని శ్రీవేంకటేశ పలురతులుఁ జొక్కితి
యేకచిత్తమాయఁ బను లియ్యకొంటిరా

(||pallavi||)
ĕkkaḍi kĕkkaḍi suddu lemanevurā
vŏkkamāre yiṁtaseya vŏddu vŏddurā

(||ĕkka||)
māḍalane karam̐gidi mannanage pĕrigidi
yīḍunam̐ gobiṁchanera nemisedurā
nīḍuna nivvĕragaidi nĕyyānage pŏrugaidi
nem̐ṭigi nannŏrasevu yeḍageḍarā

(||ĕkka||)
siṁtalane junim̐gidi siggulane munim̐gidi
iṁtalone pilisevu yemaṁdurā
paṁtānage pālaidim̐ bāyānage lonaidi
yĕṁtagĕṁta sārĕ ninnu nĕchchariṁturā

(||ĕkka||)
kām̐kalane tanisidi kām̐giḍa ne nĕnasidi
vāguna nannum̐ bŏgaḍavalĕnaḍarā
paigŏni śhrīveṁkaḍeśha paluradulum̐ jŏkkidi
yegasittamāyam̐ banu liyyagŏṁṭirā