ఎక్కడి కెక్కడి సుద్దు లేమనేవురా
(॥పల్లవి॥)
ఎక్కడి కెక్కడి సుద్దు లేమనేవురా
వొక్కమారే యింతేసి యనొద్దు వొద్దురా
(॥ఎక్కడి॥)
మాటలనే కరఁగితి మన్ననకే పెరిగితి
యీటునఁ గోపించనేర నేమి సేతురా
నీటున నివ్వెఱఁగైతి నెయ్యానకే పొరుగైతి
నేటికి న న్నోరసేవు యేడ కేడరా
(॥ఎక్కడి॥)
చింతలనే జునిఁగితి సిగ్గులనే మునిఁగితి
యింతలోనే పిలిచేవు యేమందురా
పంతానకే పాలైతిఁ బాయనకే వోలైతి
యెంత కెంత సారె నిన్ను వెచ్చరింతురా
(॥ఎక్కడి॥)
కాఁకలనే తనిసితి కౌఁగిటనే నెనసితి
వాకున నన్నుఁ బొగడవలె నటరా
పైకొని శ్రీవేంకటేశ పలురతులఁ జొక్కితి
యేకచిత్త మాయ పను లియ్యకొంటిరా
(||pallavi||)
ĕkkaḍi kĕkkaḍi suddu lemanevurā
vŏkkamāre yiṁtesi yanŏddu vŏddurā
(||ĕkkaḍi||)
māḍalane karam̐gidi mannanage pĕrigidi
yīḍunam̐ gobiṁchanera nemi sedurā
nīḍuna nivvĕṟam̐gaidi nĕyyānage pŏrugaidi
neḍigi na nnorasevu yeḍa keḍarā
(||ĕkkaḍi||)
siṁtalane junim̐gidi siggulane munim̐gidi
yiṁtalone pilisevu yemaṁdurā
paṁtānage pālaidim̐ bāyanage volaidi
yĕṁta kĕṁta sārĕ ninnu vĕchchariṁturā
(||ĕkkaḍi||)
kām̐kalane tanisidi kaum̐giḍane nĕnasidi
vāguna nannum̐ bŏgaḍavalĕ naḍarā
paigŏni śhrīveṁkaḍeśha paluradulam̐ jŏkkidi
yegasitta māya panu liyyagŏṁṭirā