ఎక్కడి కెక్కడ యివిగో వలపులు
(॥పల్లవి॥)
ఎక్కడి కెక్కడ యివిగో వలపులు
యిక్కడఁ జూచిన యెన్నికలాయా
(॥ఎక్క॥)
భావములోపల పతిఁ దలఁచఁగా
చేవల నామేను చెమరించె
కావిరి నతని నే కన్నులఁ జూచి
పూవులవలెనే పులకించె
(॥ఎక్క॥)
మరిగి మఱఁగుననె మాఁటలాడఁగా
గరిమల నూర్పులు గనమాయ
వెరసి నే సుద్దులు వీనుల వినఁగా
పురిగొని వెరగులు పోగై నిలిచె
(॥ఎక్క॥)
కదియఁగ శ్రీవేంకటపతి రాఁగా
పెదవులఁ దేనేల పెర లూరె
పొదిగొని యీతఁడు భోగించఁగ నను
చెదరక నవ్వులు సెలవుల నిలిచె
(||pallavi||)
ĕkkaḍi kĕkkaḍa yivigo valabulu
yikkaḍam̐ jūsina yĕnnigalāyā
(||ĕkka||)
bhāvamulobala padim̐ dalam̐sam̐gā
sevala nāmenu sĕmariṁchĕ
kāviri nadani ne kannulam̐ jūsi
pūvulavalĕne pulagiṁchĕ
(||ĕkka||)
marigi maṟam̐gunanĕ mām̐ṭalāḍam̐gā
garimala nūrbulu ganamāya
vĕrasi ne suddulu vīnula vinam̐gā
purigŏni vĕragulu pogai nilisĕ
(||ĕkka||)
kadiyam̐ga śhrīveṁkaḍabadi rām̐gā
pĕdavulam̐ denela pĕra lūrĕ
pŏdigŏni yīdam̐ḍu bhogiṁcham̐ga nanu
sĕdaraga navvulu sĕlavula nilisĕ