Ekkadi kekkada megu lemi seppedi

ఎక్కడి కెక్కడ మేకు లేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎక్కడి కెక్కడ మేకు లేమి చెప్పేది
చక్కఁదనములు వెదఁజల్లీ నీ యెదుట

(॥ఎక్క॥)
సెలవి నున్నది నవ్వు చేతిపై నున్నది చెక్కు
కలికితనాలు చూపీఁ గాంత నీకు
పిలుపు పెదవిపై ప్రియము మనసులోన
సొలసి వలపు పౌజు చూపీ నీయెదుట

(॥ఎక్క॥)
చెమటలు చెంపలను సిగ్గులు నిలువునను
తమకమె కుప్పళించీ తరుణి నీకు
జమళిచూపు కన్నుల జంకెనలు బొమ్మల
తిమురుఁ గోరికలెల్లాఁ దెలిపీ నీయెదుట

(॥ఎక్క॥)
అసురుసురు కాఁగిట నడియాస రతులను
పొసఁగ నప్పణ సేసీఁ బొలిఁత నీకు
యెసఁగ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కొసరి తానూ ముద్దు గురిసీ నీయెదుట

(||pallavi||)
ĕkkaḍi kĕkkaḍa megu lemi sĕppedi
sakkam̐danamulu vĕdam̐jallī nī yĕduḍa

(||ĕkka||)
sĕlavi nunnadi navvu sedibai nunnadi sĕkku
kaligidanālu sūbīm̐ gāṁta nīgu
pilubu pĕdavibai priyamu manasulona
sŏlasi valabu pauju sūbī nīyĕduḍa

(||ĕkka||)
sĕmaḍalu sĕṁpalanu siggulu niluvunanu
tamagamĕ kuppaḽiṁchī taruṇi nīgu
jamaḽisūbu kannula jaṁkĕnalu bŏmmala
timurum̐ gorigalĕllām̐ dĕlibī nīyĕduḍa

(||ĕkka||)
asurusuru kām̐giḍa naḍiyāsa radulanu
pŏsam̐ga nappaṇa sesīm̐ bŏlim̐ta nīgu
yĕsam̐ga śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kŏsari tānū muddu gurisī nīyĕduḍa