Ekkadi jaali yemtigi neegu yevvarivamkaa nemimkam galadu

ఎక్కడి జాలి యేఁటికి నీకు యెవ్వరివంకా నేమిఁకఁ గలదు
Language

(॥పల్లవి॥)
ఎక్కడి జాలి యేఁటికి నీకు యెవ్వరివంకా నేమిఁకఁ గలదు
తక్కిన వెల్లాఁ దడవక మాని ధర్మమెఱిఁగి బ్రదుకవో మనసా

(॥ఎక్కడి॥)
పుట్టినయపుడే తమకర్మములు పొదుగకపోవు జీవుల నెల్లా
నెట్టనవిధినిఁ గడచేనంటే నేర్పునఁ బడదు బ్రహ్మకునైనా
అట్టిట్టనకా హృదయములోని హరికే శరణు చొచ్చితి నంటే
గట్టిగ నతఁడే దిక్కయి నిలిచి కావఁగఁ గలఁడు వెఱవకు మనసా

(॥ఎక్కడి॥)
సొంపున నీ సంసారంబునకు చొచ్చినయపుడే తగిలెను తొడుసు
దింపఁగరాని మోపులు సుమ్మీ తీపులు రేఁచీ సంపద లెల్లా
రంపపుటాన దీనికిఁ దోడు రాతిరిఁ బగలు పెట్టని తరవు
యింపున గోవిందా యని నొడుగు యితఁడే దయరక్షించును మనసా

(॥ఎక్కడి॥)
కావలెనని తాఁ గోరినయపుడే కప్పునుమాయ తోయఁగరాదు
కేవలమైన వుపమలచేత గెలువఁగరాదు తెలియని చిక్కు
ఆవల నేమీఁ దడవఁగ నేలా యఖిలంబునకు నేలికెయైనా
శ్రీవేంకటేశుపాదములెపుడూ సేవింపుచునుచెలఁగవో మనసా

(||pallavi||)
ĕkkaḍi jāli yem̐ṭigi nīgu yĕvvarivaṁkā nemim̐kam̐ galadu
takkina vĕllām̐ daḍavaga māni dharmamĕṟim̐gi bradugavo manasā

(||ĕkkaḍi||)
puṭṭinayabuḍe tamagarmamulu pŏdugagabovu jīvula nĕllā
nĕṭṭanavidhinim̐ gaḍasenaṁṭe nerbunam̐ baḍadu brahmagunainā
aṭṭiṭṭanagā hṛdayamuloni harige śharaṇu sŏchchidi naṁṭe
gaṭṭiga nadam̐ḍe dikkayi nilisi kāvam̐gam̐ galam̐ḍu vĕṟavagu manasā

(||ĕkkaḍi||)
sŏṁpuna nī saṁsāraṁbunagu sŏchchinayabuḍe tagilĕnu tŏḍusu
diṁpam̐garāni mobulu summī tībulu rem̐sī saṁpada lĕllā
raṁpabuḍāna dīnigim̐ doḍu rādirim̐ bagalu pĕṭṭani taravu
yiṁpuna goviṁdā yani nŏḍugu yidam̐ḍe dayarakṣhiṁchunu manasā

(||ĕkkaḍi||)
kāvalĕnani tām̐ gorinayabuḍe kappunumāya toyam̐garādu
kevalamaina vubamalaseda gĕluvam̐garādu tĕliyani sikku
āvala nemīm̐ daḍavam̐ga nelā yakhilaṁbunagu neligĕyainā
śhrīveṁkaḍeśhubādamulĕbuḍū seviṁpusunusĕlam̐gavo manasā