ఎక్కడెక్కడో సుద్దుల కెంత సేసేరు
(॥పల్లవి॥)
ఎక్కడెక్కడో సుద్దుల కెంత సేసేరు
నిక్కి యాపెఁ జూచితేను నింద నీపైవేయరా
(॥ఎక్క॥)
జవ్వనితో నీ వొకసన్న సేసితివంటాను
రవ్వలుగా నాడేరు రమణులెల్లా
పువ్విళ్లూర నీవుగన వొద్దఁ బెట్టుకుండితేను
చివ్వన సోబానఁ బాడి సేసవెట్టుండేరా
(॥ఎక్క॥)
ఆపెమీఁద నీచూపు లటు గొంత నాటెనంటా
మూపులు మూఁడై కొంగులు ముళ్లు వేసేరు
యేపునఁ దొడపై నీవు యీసె నెక్కించుకోంటేను
కాఁపురపు బాసికాలు కట్టకమానేరా
(॥ఎక్క॥)
పమ్మి యాపెపై నీవు పాదాలు చాఁచితివంటా
దిమ్మురైఁగి ఇందరు నీదేవు లనేరు
ఇమ్ముల శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
కమ్మర నందురును నీ కైవశమే యనరా
(||pallavi||)
ĕkkaḍĕkkaḍo suddula kĕṁta seseru
nikki yābĕm̐ jūsidenu niṁda nībaiveyarā
(||ĕkka||)
javvanido nī vŏgasanna sesidivaṁṭānu
ravvalugā nāḍeru ramaṇulĕllā
puvviḽlūra nīvugana vŏddam̐ bĕṭṭuguṁḍidenu
sivvana sobānam̐ bāḍi sesavĕṭṭuṁḍerā
(||ĕkka||)
ābĕmīm̐da nīsūbu laḍu gŏṁta nāḍĕnaṁṭā
mūbulu mūm̐ḍai kŏṁgulu muḽlu veseru
yebunam̐ dŏḍabai nīvu yīsĕ nĕkkiṁchugoṁṭenu
kām̐purabu bāsigālu kaṭṭagamānerā
(||ĕkka||)
pammi yābĕbai nīvu pādālu sām̐sidivaṁṭā
dimmuraim̐gi iṁdaru nīdevu laneru
immula śhrīveṁkaḍeśha yelidivi mammu niṭṭĕ
kammara naṁdurunu nī kaivaśhame yanarā