Ekkadaudaa neṟumgavu yemayyaa

ఎక్కడౌతా నెఱుఁగవు యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎక్కడౌతా నెఱుఁగవు యేమయ్యా
దిక్కరించనోపము(ను?) తెర వేసేమ(న?)య్యా

(॥ఎక్క॥)
చెక్కులఁ జెమట నిండె చెలియ తురుము వీడె
యిక్కువలంటి పెనఁగే వెందాఁకనయ్యా
చొక్కపు నీసతులెల్లాఁ జూచి కడు నవ్వేరు
తెక్కుల నీ కూటమికిఁ దెర వేసే నయ్యా

(॥ఎక్క॥)
చన్నులు బయటఁబడె జవ్వనమదము రేంగె
యెన్నేసి నవ్వులు నవ్వే వెందాఁకా నయ్యా
సన్నసేసుకొంటాను సతులెల్లా మూఁగేరు
తిన్నని నీ సిగ్గు మూయఁ దెర వేసే నయ్యా

(॥ఎక్క॥)
మొలనూలు జారెను ముందే పోఁకముడి వీడె
యెలమిఁ గూడితి వాసలెందాఁకా నయ్యా
వలచి శ్రీవేంకటేశ వనితలు మెచ్చేరు
తెలిసితి మీ మనసు తెర వేసే నయ్యా

(||pallavi||)
ĕkkaḍaudā nĕṟum̐gavu yemayyā
dikkariṁchanobamu(nu?) tĕra vesema(na?)yyā

(||ĕkka||)
sĕkkulam̐ jĕmaḍa niṁḍĕ sĕliya turumu vīḍĕ
yikkuvalaṁṭi pĕnam̐ge vĕṁdām̐kanayyā
sŏkkabu nīsadulĕllām̐ jūsi kaḍu navveru
tĕkkula nī kūḍamigim̐ dĕra vese nayyā

(||ĕkka||)
sannulu bayaḍam̐baḍĕ javvanamadamu reṁgĕ
yĕnnesi navvulu navve vĕṁdām̐kā nayyā
sannasesugŏṁṭānu sadulĕllā mūm̐geru
tinnani nī siggu mūyam̐ dĕra vese nayyā

(||ĕkka||)
mŏlanūlu jārĕnu muṁde pom̐kamuḍi vīḍĕ
yĕlamim̐ gūḍidi vāsalĕṁdām̐kā nayyā
valasi śhrīveṁkaḍeśha vanidalu mĕchcheru
tĕlisidi mī manasu tĕra vese nayyā