ఎక్కడౌతా నెఱఁగదు ఇంతి నీమీఁది యాసల
(॥పల్లవి॥)
ఎక్కడౌతా నెఱఁగదు ఇంతి నీమీఁది యాసల
చెక్కులెల్లఁ బులకించె చెల్లఁబో నీ వలపు
(॥ఎక్క॥)
గుబ్బలపై పట్టుంచుకొంగు జారుతెఱఁగదు
అబ్బురపడి మాటాడీ అప్పటి నీతో
గొబ్బున సంపెఁగలకొప్పు వీడు తెరఁగదు
నిబ్బరాన నవ్వీ చెలి నిండెఁబో నీ వలపు
(॥ఎక్క॥)
చెమట కస్రూరి బొట్టు చెదరిన దెరఁగదు
తమకాన నిన్నుఁ జూచీ తప్పక మోము
జమళివడ్డాణము జారినది యెఱఁగదు
కొమరె నీమాట విని కూడెఁబో నీవలపు
(॥ఎక్క॥)
అందెలు దిక్కుల గల్లురనే దది యెఱఁగదు
ఇందుముఖి కాఁగిలించీ ఇంపురతుల
విందుగఁ గూడితివి శ్రీవేంకటేశ మాసతిని
ముందువెన కెరఁగదు ముంచెఁబో నీ వలపు
(||pallavi||)
ĕkkaḍaudā nĕṟam̐gadu iṁti nīmīm̐di yāsala
sĕkkulĕllam̐ bulagiṁchĕ sĕllam̐bo nī valabu
(||ĕkka||)
gubbalabai paṭṭuṁchugŏṁgu jārudĕṟam̐gadu
abburabaḍi māḍāḍī appaḍi nīdo
gŏbbuna saṁpĕm̐galagŏppu vīḍu tĕram̐gadu
nibbarāna navvī sĕli niṁḍĕm̐bo nī valabu
(||ĕkka||)
sĕmaḍa kasrūri bŏṭṭu sĕdarina dĕram̐gadu
tamagāna ninnum̐ jūsī tappaga momu
jamaḽivaḍḍāṇamu jārinadi yĕṟam̐gadu
kŏmarĕ nīmāḍa vini kūḍĕm̐bo nīvalabu
(||ĕkka||)
aṁdĕlu dikkula gallurane dadi yĕṟam̐gadu
iṁdumukhi kām̐giliṁchī iṁpuradula
viṁdugam̐ gūḍidivi śhrīveṁkaḍeśha māsadini
muṁduvĕna kĕram̐gadu muṁchĕm̐bo nī valabu