Ekkadanumdi vachcheno yemkari nee radulagu

ఎక్కడనుండి వచ్చెనో యేఁకరి నీ రతులకు
Language

(॥పల్లవి॥)
ఎక్కడనుండి వచ్చెనో యేఁకరి నీ రతులకు
చిక్కించుక కాఁపురము సేయవయ్యా

(॥ఎక్క॥)
లక్కవలెఁ గరఁగీని లలన నీ మాఁటలకు
చొక్కుచు నాపె వలపు చూడవయ్యా
మొక్కుచు వినయాన నీ ముందర నిలుచున్నది
అక్కర యెంత గలదో అడుగవయ్య

(॥ఎక్క॥)
జిగురువలె నంటీని చెలియ నీ పొందులకు
తెగని చుట్టరికము తెలియవయ్యా
నగుతా సారెకు నీతో ననుపులే పచరించీ
చిగిరింపుఁ గోరికలు చెల్లించవయ్యా

(॥ఎక్క॥)
తేగెవలె నల్లుకొనీ తెరవ నీ కాఁగిటికి
జాగులు సేయ కది విచారించవయ్యా
యీగతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
బాగుగా నన్నేలితి వాపడఁతి నేలవయ్యా

(||pallavi||)
ĕkkaḍanuṁḍi vachchĕno yem̐kari nī radulagu
sikkiṁchuga kām̐puramu seyavayyā

(||ĕkka||)
lakkavalĕm̐ garam̐gīni lalana nī mām̐ṭalagu
sŏkkusu nābĕ valabu sūḍavayyā
mŏkkusu vinayāna nī muṁdara nilusunnadi
akkara yĕṁta galado aḍugavayya

(||ĕkka||)
jiguruvalĕ naṁṭīni sĕliya nī pŏṁdulagu
tĕgani suṭṭarigamu tĕliyavayyā
nagudā sārĕgu nīdo nanubule pasariṁchī
sigiriṁpum̐ gorigalu sĕlliṁchavayyā

(||ĕkka||)
tegĕvalĕ nallugŏnī tĕrava nī kām̐giḍigi
jāgulu seya kadi visāriṁchavayyā
yīgadi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
bāgugā nannelidi vābaḍam̐ti nelavayyā