Ekkadanumdi vachcheno yeebe neegu

ఎక్కడనుండి వచ్చెనో యీపె నీకు
Language

(॥పల్లవి॥)
ఎక్కడనుండి వచ్చెనో యీపె నీకు
గక్కన యీ చేఁతలను కడు నందగారి

(॥ఎక్క॥)
మొగము చూపుకొంటాను ముందురనిలుచున్నది
వెగటుగా నవ్వీ నెంత వెడవికారి
చిగురుమోవి తేనెలు చిందఁగానే మాఁటలాడీ
పగటున నిది యెంత బయకారి

(॥ఎక్క॥)
కన్నుల సొలసుకొంటా కానుక నీ చేతికిచ్చీ
సన్నలా చాయలా నెంత సటలకారి
చిన్న చెక్కుల మీఁదటి చెనకులు కొనగోర
మిన్నక చిమ్మీ నెంత మేఁటి నయగారి

(॥ఎక్క॥)
వాలాయించి మెచ్చుకొంటా వలపులు చల్లి చల్లి
కాలు దొక్కీ ని న్నెంతకతకారి
యీలీల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వోల వేసీ దా నెంత నీ కుపకారి

(||pallavi||)
ĕkkaḍanuṁḍi vachchĕno yībĕ nīgu
gakkana yī sem̐talanu kaḍu naṁdagāri

(||ĕkka||)
mŏgamu sūbugŏṁṭānu muṁduranilusunnadi
vĕgaḍugā navvī nĕṁta vĕḍavigāri
sigurumovi tenĕlu siṁdam̐gāne mām̐ṭalāḍī
pagaḍuna nidi yĕṁta bayagāri

(||ĕkka||)
kannula sŏlasugŏṁṭā kānuga nī sedigichchī
sannalā sāyalā nĕṁta saḍalagāri
sinna sĕkkula mīm̐daḍi sĕnagulu kŏnagora
minnaga simmī nĕṁta mem̐ṭi nayagāri

(||ĕkka||)
vālāyiṁchi mĕchchugŏṁṭā valabulu salli salli
kālu dŏkkī ni nnĕṁtagadagāri
yīlīla śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vola vesī dā nĕṁta nī kubagāri