ఎక్కడఁ జిత్తమున్నది యెవ్వరితో మాటాడేవు
(॥పల్లవి॥)
ఎక్కడఁ జిత్తమున్నది యెవ్వరితో మాటాడేవు
చొక్కపు మా చేతిది చూడవయ్య కానికె
(॥॥)
నెలఁత వోరువలేదు నిన్నుఁ గొసరక పోదు
చెలరేఁగె విరహము చెప్పరాదు
వెలలేని విన్నపాలు వేవేలుఁ జేసితిమి
సొలసి మాచేత నిదె చూడవయ్య కానికె
(॥॥)
చెమటలే ముంచీని చింతలెల్లఁ బెంచీని
జమళి తమకములు సారె నించీని
సముకాన నీతోను చనవులు చూపితిమి
సముకుఁడ మాచేతుల జూడవయ్య కానికె
(॥॥)
మేడెపు రతుల జొక్కె మెలుఁత నీకాలు దొక్కె
కూడితి శ్రీవేంకటేశ కోరికె దక్కె
వేడుకచెలులమెల్లా వింతలుగా మొక్కితిమి
జోడగుమాచేతులందుఁ జూడవయ్య కానికె
(||pallavi||)
ĕkkaḍam̐ jittamunnadi yĕvvarido māḍāḍevu
sŏkkabu mā sedidi sūḍavayya kānigĕ
(||||)
nĕlam̐ta voruvaledu ninnum̐ gŏsaraga podu
sĕlarem̐gĕ virahamu sĕpparādu
vĕlaleni vinnabālu vevelum̐ jesidimi
sŏlasi māseda nidĕ sūḍavayya kānigĕ
(||||)
sĕmaḍale muṁchīni siṁtalĕllam̐ bĕṁchīni
jamaḽi tamagamulu sārĕ niṁchīni
samugāna nīdonu sanavulu sūbidimi
samugum̐ḍa māsedula jūḍavayya kānigĕ
(||||)
meḍĕbu radula jŏkkĕ mĕlum̐ta nīgālu dŏkkĕ
kūḍidi śhrīveṁkaḍeśha korigĕ dakkĕ
veḍugasĕlulamĕllā viṁtalugā mŏkkidimi
joḍagumāsedulaṁdum̐ jūḍavayya kānigĕ