ఎక్కడఁ దెచ్చుకొంటివి యెన్నఁడు పెండ్లాడితివి
(॥పల్లవి॥)
ఎక్కడఁ దెచ్చుకొంటివి యెన్నఁడు పెండ్లాడితివి
అక్కజపు టీ సుద్ది ఆనతీవయ్యా
(॥ఎక్క॥)
పంచనిచెక్కులతో పగడవాతెరతోడ
సెలవుల నవ్వు నవ్వి చెలరేఁగీని
కలువకన్నులచూపు కడుఁగడు నాటఁగ
సోలసిసోలసి చూచి సుదతి యిదెవ్వతో
(॥ఎక్క॥)
పిక్కటిల్లుఁజన్నులపైఁ బెట్టినపయ్యద జార
మొక్కీ నీకుఁ జేతులెత్తి ముందరనుండి
నిక్కుగాఁ దురుమువెట్టి నేరుపులెల్లా మెరసి
మిక్కిలి సరసమాడీ మెలుఁత ఇదెవ్వతో
(॥ఎక్క॥)
మొలనూలిగంటలు మొరమొరమనఁగాను
అలమి పెనఁగులాడీ అంటి నిన్ను
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ
యిల నన్ను గూడితివి యీపెనిదెవ్వతో
(||pallavi||)
ĕkkaḍam̐ dĕchchugŏṁṭivi yĕnnam̐ḍu pĕṁḍlāḍidivi
akkajabu ṭī suddi ānadīvayyā
(||ĕkka||)
paṁchanisĕkkulado pagaḍavādĕradoḍa
sĕlavula navvu navvi sĕlarem̐gīni
kaluvagannulasūbu kaḍum̐gaḍu nāḍam̐ga
solasisolasi sūsi sudadi yidĕvvado
(||ĕkka||)
pikkaḍillum̐jannulabaim̐ bĕṭṭinabayyada jāra
mŏkkī nīgum̐ jedulĕtti muṁdaranuṁḍi
nikkugām̐ durumuvĕṭṭi nerubulĕllā mĕrasi
mikkili sarasamāḍī mĕlum̐ta idĕvvado
(||ĕkka||)
mŏlanūligaṁṭalu mŏramŏramanam̐gānu
alami pĕnam̐gulāḍī aṁṭi ninnu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśha
yila nannu gūḍidivi yībĕnidĕvvado