ఎక్కడా నెఱఁగమమ్మ యిటువంటి బత్తి
(॥పల్లవి॥)
ఎక్కడా నెఱఁగమమ్మ యిటువంటి బత్తి
చిక్కించే దెటువలెనే చేతిలోని కతని
(॥ఎక్క॥)
మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు
చెనకే దెటువలెనే చెలువునిని
వనితరో పతికొప్పు వంగీనంటా లోఁగేవు
పెనఁగే దెటువలెనే ప్రియమైన వేళను
(॥ఎక్క॥)
వెంగెమవునో యనుచును వెస నవ్వఁజాలవు
సంగతయ్యే దెటులనే సరసములు
యెంగిలయ్యీ నంటా మోవి యించుకంతా నడుగవు
ముంగిటిరతుల నింక ముంచే దెటువలెనే
(॥ఎక్క॥)
సిగ్గువడీనో యంటా చెరఁగువట్టి తియ్యవు
వెగ్గళించే దెట్టే శ్రీవేంకటేశుని
యెగ్గువట్టినో యంటా నిట్టే గోరు దాఁకించవు
వొగ్గి కూడితివి యిట్టే వుబ్బు దెలిసే దెట్టే
(||pallavi||)
ĕkkaḍā nĕṟam̐gamamma yiḍuvaṁṭi batti
sikkiṁche dĕḍuvalĕne sediloni kadani
(||ĕkka||)
manasu nŏchchīnaṁṭā māḍalāḍa vĕrasevu
sĕnage dĕḍuvalĕne sĕluvunini
vanidaro padigŏppu vaṁgīnaṁṭā lom̐gevu
pĕnam̐ge dĕḍuvalĕne priyamaina veḽanu
(||ĕkka||)
vĕṁgĕmavuno yanusunu vĕsa navvam̐jālavu
saṁgadayye dĕḍulane sarasamulu
yĕṁgilayyī naṁṭā movi yiṁchugaṁtā naḍugavu
muṁgiḍiradula niṁka muṁche dĕḍuvalĕne
(||ĕkka||)
sigguvaḍīno yaṁṭā sĕram̐guvaṭṭi tiyyavu
vĕggaḽiṁche dĕṭṭe śhrīveṁkaḍeśhuni
yĕgguvaṭṭino yaṁṭā niṭṭe goru dām̐kiṁchavu
vŏggi kūḍidivi yiṭṭe vubbu dĕlise dĕṭṭe