Ekkada voyeno jaadasmaratvamu yemi seyamgalavaamdanu nenu

ఎక్కడ వోయెనో జాతస్మరత్వము యేమి సేయఁగలవాఁడను నేను
Language

(॥పల్లవి॥)
ఎక్కడ వోయెనో జాతస్మరత్వము యేమి సేయఁగలవాఁడను నేను
దిక్కు నీవే హరి నన్నుఁ గాచుటకు దేవదేవ యిఁక బోధించవే

(॥ఎక్కడ॥)
తిరముగ జన్మాంతరమున సంపాదించిన సుజ్ఞానంబున
స్మరించి యీ పుట్టుగునఁ గడమ నే సాధించెద నని యంటివా
అరయఁ దల్లి గర్భంబున వెడలినయపుడే అన్నియు మఱచితిని
ధరలోపల నే విడువక ద్రావిన మరులుఁ బాలు నను మంకుఁజేసేను

(॥ఎక్కడ॥)
అంతట నేఁ బెద్ద వెరిగి బుద్ధెఱిఁగి అటు నీ మాయా ప్రపంచమునను
చెంతల బహువిధసృష్టిలోఁ దగిలి చిక్కువడుచు నే భ్రమసితిని
చింతించినేమఱీ పెక్కులు చదువుచు చిత్తములో బహుసంశయములఁబడి
అంతట నంతట జరగి జరగి కడు నజ్ఞానముపాలైతిని

(॥ఎక్కడ॥)
ముదిసినపిమ్మట లోభమోహములు ముంచుకొనఁగ నటు లోలుఁడనైతి
వదలక భువిపై బ్రహ్మదేవుఁ డటు వ్రాసిన వ్రాతలు నిజమాయె
చెదరక యలమేల్మంగ విన్నపము చేకొని శ్రీవేంకటేశ కాచితివి
బ్రదికితి నిఁక నాచార్యునియానతి ఫలియించెను నా భాగ్యమువలన

(||pallavi||)
ĕkkaḍa voyĕno jādasmaratvamu yemi seyam̐galavām̐ḍanu nenu
dikku nīve hari nannum̐ gāsuḍagu devadeva yim̐ka bodhiṁchave

(||ĕkkaḍa||)
tiramuga janmāṁtaramuna saṁpādiṁchina sujñānaṁbuna
smariṁchi yī puṭṭugunam̐ gaḍama ne sādhiṁchĕda nani yaṁṭivā
arayam̐ dalli garbhaṁbuna vĕḍalinayabuḍe anniyu maṟasidini
dharalobala ne viḍuvaga drāvina marulum̐ bālu nanu maṁkum̐jesenu

(||ĕkkaḍa||)
aṁtaḍa nem̐ bĕdda vĕrigi buddhĕṟim̐gi aḍu nī māyā prabaṁchamunanu
sĕṁtala bahuvidhasṛṣhṭilom̐ dagili sikkuvaḍusu ne bhramasidini
siṁtiṁchinemaṟī pĕkkulu saduvusu sittamulo bahusaṁśhayamulam̐baḍi
aṁtaḍa naṁtaḍa jaragi jaragi kaḍu najñānamubālaidini

(||ĕkkaḍa||)
mudisinabimmaḍa lobhamohamulu muṁchugŏnam̐ga naḍu lolum̐ḍanaidi
vadalaga bhuvibai brahmadevum̐ ḍaḍu vrāsina vrādalu nijamāyĕ
sĕdaraga yalamelmaṁga vinnabamu segŏni śhrīveṁkaḍeśha kāsidivi
bradigidi nim̐ka nāsāryuniyānadi phaliyiṁchĕnu nā bhāgyamuvalana