Ekkada paraagusese vemti suddulu seppevu

ఎక్కడ పరాకుసేసే వేఁటి సుద్దులు చెప్పేవు
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకుసేసే వేఁటి సుద్దులు చెప్పేవు
చెక్కుచేయి దీసి యిట్టె సేస చల్లరాదా

(॥ఎక్క॥)
ముంమణిదంతములు మెరువఁగ మాటలాడీ
చెంచెలాక్షి నీతోడ సారెసారెకు
వంచిన మోవితేనె వడియఁగా నవ్వు నవ్వీ
యించుకంత చెలిదిక్కు యిటు చూడరాదా

(॥ఎక్క॥)
కమ్మఁ దామెరలవంటి కరములు చాఁచిచాఁచి
కొమ్మ నినను సన్నసేసీఁ గూరిమితోడ
వుమ్మ పన్నీటి చెమట నుసురసురనుకొంటా
దిమ్మరేఁచీ వలపులు దిష్టించరాదా

(॥ఎక్క॥)
పచ్చని తీగెలవంటి బాహుమూలముల నిన్ను
పుచ్చి కాఁగిలించి పట్టీ కోమలి నేఁడు
ఇచ్చెరిఁగి శ్రీవేంటేశ కూడితివి ఇట్టె
ముచ్చటసిగ్గిఁకనేల మోము చూపరాదా

(||pallavi||)
ĕkkaḍa parāgusese vem̐ṭi suddulu sĕppevu
sĕkkuseyi dīsi yiṭṭĕ sesa sallarādā

(||ĕkka||)
muṁmaṇidaṁtamulu mĕruvam̐ga māḍalāḍī
sĕṁchĕlākṣhi nīdoḍa sārĕsārĕgu
vaṁchina movidenĕ vaḍiyam̐gā navvu navvī
yiṁchugaṁta sĕlidikku yiḍu sūḍarādā

(||ĕkka||)
kammam̐ dāmĕralavaṁṭi karamulu sām̐sisām̐si
kŏmma ninanu sannasesīm̐ gūrimidoḍa
vumma pannīḍi sĕmaḍa nusurasuranugŏṁṭā
dimmarem̐sī valabulu diṣhṭiṁcharādā

(||ĕkka||)
pachchani tīgĕlavaṁṭi bāhumūlamula ninnu
puchchi kām̐giliṁchi paṭṭī komali nem̐ḍu
ichchĕrim̐gi śhrīveṁṭeśha kūḍidivi iṭṭĕ
muchchaḍasiggim̐kanela momu sūbarādā