ఎక్కడ పరాకుసేసే వెందాఁకాను
(॥పల్లవి॥)
ఎక్కడ పరాకుసేసే వెందాఁకాను
వెక్కసపుఁ దమకాన విడెమియ్యరాదా
(॥ఎక్క॥)
చిడుముడినవ్వుతోడ చెలి నిన్నుఁ గొసరఁగా
తొడపైఁ బెట్టుకోరాదా దొరవు నీవు
నడియుఁజెమటతోడ వలపులు చల్లఁగాను
తుడువరాదా నీవు దుప్పటికొంగునను
(॥ఎక్క॥)
వాలుక చూపులతోడ వనితనీకు మొక్కఁగా
పాలించి పైకొనరాదా పతివి నీవు
మేలములాడుచు నీతో మేనరికము చెప్పఁగా
ఆలిఁగాఁ బెండ్లాడరాదా ఆదరముతోడను
(॥ఎక్క॥)
అలమేలుమంగ నిన్ను నట్టె కాఁగిలించుకోఁగా
చెలఁగి మోవియ్యరాదాశ్రీవేంకటేశ
చలమిబలిమి నీకు చవులు వుట్టించఁగాను
పలుమారు మెచ్చరాదా భావము దెలియను
(||pallavi||)
ĕkkaḍa parāgusese vĕṁdām̐kānu
vĕkkasabum̐ damagāna viḍĕmiyyarādā
(||ĕkka||)
siḍumuḍinavvudoḍa sĕli ninnum̐ gŏsaram̐gā
tŏḍabaim̐ bĕṭṭugorādā dŏravu nīvu
naḍiyum̐jĕmaḍadoḍa valabulu sallam̐gānu
tuḍuvarādā nīvu duppaḍigŏṁgunanu
(||ĕkka||)
vāluga sūbuladoḍa vanidanīgu mŏkkam̐gā
pāliṁchi paigŏnarādā padivi nīvu
melamulāḍusu nīdo menarigamu sĕppam̐gā
ālim̐gām̐ bĕṁḍlāḍarādā ādaramudoḍanu
(||ĕkka||)
alamelumaṁga ninnu naṭṭĕ kām̐giliṁchugom̐gā
sĕlam̐gi moviyyarādāśhrīveṁkaḍeśha
salamibalimi nīgu savulu vuṭṭiṁcham̐gānu
palumāru mĕchcharādā bhāvamu dĕliyanu