Ekkada paraagu neegu yedabai neege vunnadi

ఎక్కడ పరాకు నీకు యెదపై నీకె వున్నది
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు యెదపై నీకె వున్నది
మక్కువతో నన్నిటాను మన్నించరాదా

(॥ఎక్క॥)
చెక్కులఁ జెమట గారఁ జిప్పిలుఁ గళలతోడ
అక్కరతోనీకు మొక్కీ నప్పటనుండి
వెక్కసపుఁ బావురాలవేడుక లెంతచూచేవు
జక్కవ లివిగో ఇంతిచన్నులు చూడరాదా

(॥ఎక్క॥)
నించినకోర్కులు మీర నెట్టుకొన చూపులతో
పొంచి నీకుఁ గానుకియ్యఁ బూఁచుకున్నది
పెంచినకోవిలకూఁత బెటుగా నేమి వినేవు
మంచి చిల్కపలు కీకెమాట వినరాదా

(॥ఎక్క॥)
తలపోఁతలరతులతమితో శ్రీవేంకటేశ
అలమేల్‌మంగవద్ద నదె వున్నది
నెలకొన్నఇంటిలోన నెమళ్లతో నేమాడేవు
చెలి హంసవంటి దీపె చెల్లాటా లాడరాదా

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu yĕdabai nīgĕ vunnadi
makkuvado nanniḍānu manniṁcharādā

(||ĕkka||)
sĕkkulam̐ jĕmaḍa gāram̐ jippilum̐ gaḽaladoḍa
akkaradonīgu mŏkkī nappaḍanuṁḍi
vĕkkasabum̐ bāvurālaveḍuga lĕṁtasūsevu
jakkava livigo iṁtisannulu sūḍarādā

(||ĕkka||)
niṁchinagorgulu mīra nĕṭṭugŏna sūbulado
pŏṁchi nīgum̐ gānugiyyam̐ būm̐sugunnadi
pĕṁchinagovilagūm̐ta bĕḍugā nemi vinevu
maṁchi silgabalu kīgĕmāḍa vinarādā

(||ĕkka||)
talabom̐talaraduladamido śhrīveṁkaḍeśha
alamel‌maṁgavadda nadĕ vunnadi
nĕlagŏnna̮iṁṭilona nĕmaḽlado nemāḍevu
sĕli haṁsavaṁṭi dībĕ sĕllāḍā lāḍarādā