Ekkada paraagu neegu nimtim garunimcharaadaa

ఎక్కడ పరాకు నీకు నింతిఁ గరుణించరాదా
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు నింతిఁ గరుణించరాదా
నెక్కొని నీ యెదుటనే నిలుచున్న దిదివో

(॥ఎక్క॥)
చెలియచెక్కులవెంటఁ జెమటలు గారఁగాను
మలసి సొలసి నీతో మాటలాడీని
తలఁపులో పలపులు తమకము రేఁచఁగాను
కలువపువ్వులు నీకుఁ గాను కిచ్చీ నిదివో

(॥ఎక్క॥)
పడఁతి తురుము చెంపలమీఁద జారఁగాను
నడుమ నూరకే తాను నవ్వు నవ్వీని
వుడివోక పులకలు వొడవెల్లా నిండఁగాను
కడు నడిగాలు నీకుఁ గమ్మటిఁ జేసీని

(॥ఎక్క॥)
కొమ్మ తనపయ్యద కుచములపై జారఁగా
కమ్మినవేడుక నిన్నుఁ గాఁగిలించీని
నెమ్మది శ్రీవేంకటేశ నీవు దన్ను నేలఁ గాను
సమ్మతితో మెచ్చి సంతోసించీని

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu niṁtim̐ garuṇiṁcharādā
nĕkkŏni nī yĕduḍane nilusunna didivo

(||ĕkka||)
sĕliyasĕkkulavĕṁṭam̐ jĕmaḍalu gāram̐gānu
malasi sŏlasi nīdo māḍalāḍīni
talam̐pulo palabulu tamagamu rem̐sam̐gānu
kaluvabuvvulu nīgum̐ gānu kichchī nidivo

(||ĕkka||)
paḍam̐ti turumu sĕṁpalamīm̐da jāram̐gānu
naḍuma nūrage tānu navvu navvīni
vuḍivoga pulagalu vŏḍavĕllā niṁḍam̐gānu
kaḍu naḍigālu nīgum̐ gammaḍim̐ jesīni

(||ĕkka||)
kŏmma tanabayyada kusamulabai jāram̐gā
kamminaveḍuga ninnum̐ gām̐giliṁchīni
nĕmmadi śhrīveṁkaḍeśha nīvu dannu nelam̐ gānu
sammadido mĕchchi saṁtosiṁchīni