Ekkada paraagu neegu neṟamgaraadaa

ఎక్కడ పరాకు నీకు నెఱఁగరాదా
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు నెఱఁగరాదా
నిక్కము వలపించే యెన్ని కలెల్లా నున్నవి

(॥ఎక్క॥)
చెప్పఁబూఁచీ పిగ్గు లాపె చెవి యొగ్గరాదా
తప్ప కిట్టె కాఁగిలించేతమి వున్నది
చిప్పిల నేఁటికి దీరీఁ జేయీ చాఁచరాదా
వుప్పతిల్లఁ గరఁగించేవుద్యోగ మున్నది

(॥ఎక్క॥)
తేనేమోవి యియ్యఁబూఁచీఁ దెరవేయరాదా
ఆనించి నిన్ను మెప్పించేఆస లున్నవి
నానవేసీ సరసము నవ్వు నవ్వరాదా
తానకమై నినుఁబొఁ(బొం?) దేతలపోఁత లున్నవి

(॥ఎక్క॥)
ప్రేమ రతిఁ గూడఁబూఁచీఁ బిలువఁగరాదా
నీమనసురప్పించేనేరు పున్నది
యీమేర శ్రీవేంకటేశ యెనసితివి నన్ను నీ
వామగువఁ గూడితివి ఆగుఱుతు లున్నవి

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu nĕṟam̐garādā
nikkamu valabiṁche yĕnni kalĕllā nunnavi

(||ĕkka||)
sĕppam̐būm̐sī piggu lābĕ sĕvi yŏggarādā
tappa kiṭṭĕ kām̐giliṁchedami vunnadi
sippila nem̐ṭigi dīrīm̐ jeyī sām̐sarādā
vuppadillam̐ garam̐giṁchevudyoga munnadi

(||ĕkka||)
tenemovi yiyyam̐būm̐sīm̐ dĕraveyarādā
āniṁchi ninnu mĕppiṁcheāsa lunnavi
nānavesī sarasamu navvu navvarādā
tānagamai ninum̐bŏm̐(bŏṁ?) dedalabom̐ta lunnavi

(||ĕkka||)
prema radim̐ gūḍam̐būm̐sīm̐ biluvam̐garādā
nīmanasurappiṁcheneru punnadi
yīmera śhrīveṁkaḍeśha yĕnasidivi nannu nī
vāmaguvam̐ gūḍidivi āguṟudu lunnavi