Ekkada paraagu neegu nemayyaa

ఎక్కడ పరాకు నీకు నేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు నేమయ్యా
గక్కన నాకె నిట్టే కరుణించవయ్యా

(॥ఎక్కడ॥)
మక్కువ నీరూపు చూచి మనసులోఁ దలపోసి
చెక్కులునిండా నట్టే చెమరించి
పుక్కిటి వూరుపులతోఁ బొద్దులు చూచీఁ జెలి
యిక్కడఁ గొలువులు నీవేమి సేసేనయ్యా

(॥ఎక్కడ॥)
కానుక నీకునంపి కాయమెల్లాఁ బులకించి
పానుపుమీఁద నట్టే పవ్వళించి
ఆనుకొన్న తమితోడ నట్టే నిన్నుఁబాడీ నదే
వీనులతుదల నీవే విందువు రావయ్యా

(॥ఎక్కడ॥)
కలయఁ దానే వచ్చి కప్పురవీడెమిచ్చి
వెలలేని వెరగుల విఱ్ఱవీఁగి
యెలమి శ్రీవేంకటేశ యింతి నిన్నుఁ గూడె నిదే
తలిరుఁబోఁడి రతులు దలఁచుకోవయ్యా

(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu nemayyā
gakkana nāgĕ niṭṭe karuṇiṁchavayyā

(||ĕkkaḍa||)
makkuva nīrūbu sūsi manasulom̐ dalabosi
sĕkkuluniṁḍā naṭṭe sĕmariṁchi
pukkiḍi vūrubuladom̐ bŏddulu sūsīm̐ jĕli
yikkaḍam̐ gŏluvulu nīvemi sesenayyā

(||ĕkkaḍa||)
kānuga nīgunaṁpi kāyamĕllām̐ bulagiṁchi
pānubumīm̐da naṭṭe pavvaḽiṁchi
ānugŏnna tamidoḍa naṭṭe ninnum̐bāḍī nade
vīnuladudala nīve viṁduvu rāvayyā

(||ĕkkaḍa||)
kalayam̐ dāne vachchi kappuravīḍĕmichchi
vĕlaleni vĕragula viṭravīm̐gi
yĕlami śhrīveṁkaḍeśha yiṁti ninnum̐ gūḍĕ nide
talirum̐bom̐ḍi radulu dalam̐sugovayyā