ఎక్కడ నున్నదో యెప్పుడు వచ్చీనో చెలి
(॥పల్లవి॥)
ఎక్కడ నున్నదో యెప్పుడు వచ్చీనో చెలి
దక్కి నాలోఁ జేరి తలపోఁతాయా
(॥ఎక్కడ॥)
పడఁతి విలిచె నని పలుకఁబోతే నవి
గొడవల కోవిలకూఁతాయా
నడపులు పతివని నంటునఁ గదిసిన
నిడివిని యది యొకనెమలాయ
(॥ఎక్కడ॥)
తరుణిచూపు లని తప్పక చూచిన
నిరతపు మెఱుఁగులనిధి యాయ
సరిఁ జెలిమేనను సరసిలోఁ దొడిరిన
పొరి నది తామెరపువ్వాయా
(॥ఎక్కడ॥)
కలఁగి వెరగుతో కాఁకలఁ బొందిన
అలమేల్మంగే అరత నిదే
యెలమిని శ్రీవేంకటేశుఁడ నే నిదె
వొలసి కూడితి నిదెవో దరిలోనా
(||pallavi||)
ĕkkaḍa nunnado yĕppuḍu vachchīno sĕli
dakki nālom̐ jeri talabom̐tāyā
(||ĕkkaḍa||)
paḍam̐ti vilisĕ nani palugam̐bode navi
gŏḍavala kovilagūm̐tāyā
naḍabulu padivani naṁṭunam̐ gadisina
niḍivini yadi yŏganĕmalāya
(||ĕkkaḍa||)
taruṇisūbu lani tappaga sūsina
niradabu mĕṟum̐gulanidhi yāya
sarim̐ jĕlimenanu sarasilom̐ dŏḍirina
pŏri nadi tāmĕrabuvvāyā
(||ĕkkaḍa||)
kalam̐gi vĕragudo kām̐kalam̐ bŏṁdina
alamelmaṁge arada nide
yĕlamini śhrīveṁkaḍeśhum̐ḍa ne nidĕ
vŏlasi kūḍidi nidĕvo darilonā