ఎక్కడ నున్నా నీకు నేమాయను
(॥పల్లవి॥)
ఎక్కడ నున్నా నీకు నేమాయను
పక్కన నవే యిందు భావించుకోవయ్యా
(॥ఎక్క॥)
అతివలుండినచోటు అదె నీకు రేపల్లె
అతిశయపువలపు యమునానది
రతులకాఁగిళ్లే రాసక్రీడలు నీకు
తతి వచ్చె నిందు నవి తలఁచుకోవయ్యా
(॥ఎక్క॥)
కొమ్మలపోఁకముడులు కొలనిదరికోకలు
కుమ్మరించు మోవితేనె గొల్లదోమటి
పమ్మి వారితో నవ్వులు పాలుఁబెరుగువుట్లు
తమ్మిచూపులే రేతిరి తలఁచుకోవయ్యా
(॥ఎక్క॥)
చెలులజవ్వనమెల్లా చేరువబృందావనము
కులుకుఁజన్నులు పెక్కుగోవర్థనాలు
కలసితి మాచెలిని గక్కన శ్రీవేంకటేశ
తలఁపున నిఁకనిన్నీఁ దలఁచుకోవయ్యా
(||pallavi||)
ĕkkaḍa nunnā nīgu nemāyanu
pakkana nave yiṁdu bhāviṁchugovayyā
(||ĕkka||)
adivaluṁḍinasoḍu adĕ nīgu reballĕ
adiśhayabuvalabu yamunānadi
radulagām̐giḽle rāsakrīḍalu nīgu
tadi vachchĕ niṁdu navi talam̐sugovayyā
(||ĕkka||)
kŏmmalabom̐kamuḍulu kŏlanidarigogalu
kummariṁchu movidenĕ gŏlladomaḍi
pammi vārido navvulu pālum̐bĕruguvuṭlu
tammisūbule rediri talam̐sugovayyā
(||ĕkka||)
sĕlulajavvanamĕllā seruvabṛṁdāvanamu
kulugum̐jannulu pĕkkugovardhanālu
kalasidi māsĕlini gakkana śhrīveṁkaḍeśha
talam̐puna nim̐kaninnīm̐ dalam̐sugovayyā