Ekkada neṟumgamamma yiduvamti mohamu

ఎక్కడ నెఱుఁగమమ్మ యిటువంటి మోహము
Language

(॥పల్లవి॥)
ఎక్కడ నెఱుఁగమమ్మ యిటువంటి మోహము
అక్కరతో దూతి కేల నాదరించీ నిపుడు

(॥ఎక్కడ॥)
సురటి విసరుకొంటా జొబ్బిలుఁజెమటతోడ
అరుదుగ పతిసుద్దు లడిగీఁ జెలి
తరమిడి మాటలు తనలోఁ దలఁచుకొంటా
వొరసి తానే సారెకు నూఁకొనీ నదివో

(॥ఎక్కడ॥)
కప్పురమువేసుకొంటా కాఁకలతో వడదేరి
అప్పటి విభునిరాక లడిగి
తప్పక చూచుకొంటా తలవాకిటిదిక్కు
చెప్పి పంపీ నాతనికి చెప్పరానిమాటలు

(॥ఎక్కడ॥)
కొంచ కట్టే నిమ్మపండు గోరికొన నూఁదుకొంటా
అంచెలఁ దా వత్తునంటా నడిగీని
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
మంచము దిగనియ్యక మరిగించే నితని

(||pallavi||)
ĕkkaḍa nĕṟum̐gamamma yiḍuvaṁṭi mohamu
akkarado dūdi kela nādariṁchī nibuḍu

(||ĕkkaḍa||)
suraḍi visarugŏṁṭā jŏbbilum̐jĕmaḍadoḍa
aruduga padisuddu laḍigīm̐ jĕli
taramiḍi māḍalu tanalom̐ dalam̐sugŏṁṭā
vŏrasi tāne sārĕgu nūm̐kŏnī nadivo

(||ĕkkaḍa||)
kappuramuvesugŏṁṭā kām̐kalado vaḍaderi
appaḍi vibhunirāga laḍigi
tappaga sūsugŏṁṭā talavāgiḍidikku
sĕppi paṁpī nādanigi sĕpparānimāḍalu

(||ĕkkaḍa||)
kŏṁcha kaṭṭe nimmabaṁḍu gorigŏna nūm̐dugŏṁṭā
aṁchĕlam̐ dā vattunaṁṭā naḍigīni
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍĕ
maṁchamu diganiyyaga marigiṁche nidani