Ekkada neduru lega yeeredulogamulamdu

ఎక్కడ నెదురు లేక యీరేడులోకములందు
Language

(॥పల్లవి॥)
ఎక్కడ నెదురు లేక యీరేడులోకములందు
వొక్కఁడే నిలిచెనమ్మ వుగ్రహనుమంతుఁడు

(॥ఎక్కడ॥)
పెట్టినజంగదండ పిడికిటి మొలచేయి
అట్టె వలచేయెత్తిన యాయితము
తొట్టిన పెంజమటలు తోడనె బుసకొట్టులు
వుట్టీపడీఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు

(॥ఎక్కడ॥)
నిక్కినకర్ణములు నింగిమోఁచినబొమ్మలు
చక్కశిరసుపైఁ బారఁజూచిన తోఁక
చుక్కలు మొలపూసలు సూదుల వాఁడి రోమాలు
వుక్కుమీరెఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు

(॥ఎక్కడ॥)
పుట్టుఁగౌపీనము మహద్బుత యజ్ఞోపవీతము
గుట్టుచూపని కనకకుండలములు
పట్టపు శ్రీవేంకటేశు బంటయి ప్రతాపమెల్ల
వొట్టీ విజయనగరపు వుగ్రహనుమంతుడు

(||pallavi||)
ĕkkaḍa nĕduru lega yīreḍulogamulaṁdu
vŏkkam̐ḍe nilisĕnamma vugrahanumaṁtum̐ḍu

(||ĕkkaḍa||)
pĕṭṭinajaṁgadaṁḍa piḍigiḍi mŏlaseyi
aṭṭĕ valaseyĕttina yāyidamu
tŏṭṭina pĕṁjamaḍalu toḍanĕ busagŏṭṭulu
vuṭṭībaḍīm̐ jūḍaramma vugrahanumaṁtuḍu

(||ĕkkaḍa||)
nikkinagarṇamulu niṁgimom̐sinabŏmmalu
sakkaśhirasubaim̐ bāram̐jūsina tom̐ka
sukkalu mŏlabūsalu sūdula vām̐ḍi romālu
vukkumīrĕm̐ jūḍaramma vugrahanumaṁtuḍu

(||ĕkkaḍa||)
puṭṭum̐gaubīnamu mahadbuda yajñobavīdamu
guṭṭusūbani kanagaguṁḍalamulu
paṭṭabu śhrīveṁkaḍeśhu baṁṭayi pradābamĕlla
vŏṭṭī vijayanagarabu vugrahanumaṁtuḍu