Ekkada gadimchugomti veegenu neevu

ఎక్కడ గడించుకొంటి వీకెను నీవు
Language

(॥పల్లవి॥)
ఎక్కడ గడించుకొంటి వీకెను నీవు
పక్కన సేవలు సేసి పాదాలొత్తీని

(॥॥)
సొంపు మీరి నీతోడ సుద్దు లెల్లా విన్నవించి
చెంపల జారే కురులు చేత దువ్వీని
యింపు వుట్ట నేడలేని యిచ్చకములెల్లాఁ జేసి
జంపుల నవ్వుల నవ్వి జట్టి గొనీని

(॥॥)
మచ్చిక మాఁటలాడించి మర్మములు సోఁకించి
మెచ్చి మెచ్చి గందము నీ మేనఁ బూసీని
లచ్చెనగా గోరుదీసి లూవులు చూపి పెనఁగి
కుచ్చి కాఁగిలించి నిన్నుఁ గోరికొసరీని

(॥॥)
బాగా లిచ్చి వేఁడుకొని పచ్చడము మీఁదఁ గప్పి
ఆగడాలు సేసి కూడె నాపె నిన్నును
చేగదేర నేలితివి శ్రీ వేంకటేశ నన్ను
లాగుల నప్పటి మోవిలంచము దానిచ్చీని

(||pallavi||)
ĕkkaḍa gaḍiṁchugŏṁṭi vīgĕnu nīvu
pakkana sevalu sesi pādālŏttīni

(||||)
sŏṁpu mīri nīdoḍa suddu lĕllā vinnaviṁchi
sĕṁpala jāre kurulu seda duvvīni
yiṁpu vuṭṭa neḍaleni yichchagamulĕllām̐ jesi
jaṁpula navvula navvi jaṭṭi gŏnīni

(||||)
machchiga mām̐ṭalāḍiṁchi marmamulu som̐kiṁchi
mĕchchi mĕchchi gaṁdamu nī menam̐ būsīni
lachchĕnagā gorudīsi lūvulu sūbi pĕnam̐gi
kuchchi kām̐giliṁchi ninnum̐ gorigŏsarīni

(||||)
bāgā lichchi vem̐ḍugŏni pachchaḍamu mīm̐dam̐ gappi
āgaḍālu sesi kūḍĕ nābĕ ninnunu
segadera nelidivi śhrī veṁkaḍeśha nannu
lāgula nappaḍi movilaṁchamu dānichchīni