Ekkada daamgamga vachchu nimka neegunu

ఎక్కడ దాఁగఁగ వచ్చు నింక నీకును
Language

(॥పల్లవి॥)
ఎక్కడ దాఁగఁగ వచ్చు నింక నీకును
పక్కన నీ దాసు లెల్లా బ్రదికిరి యింకను

(॥ఎక్కడ॥)
పంతాన నెక్కడాఁ జిక్కువడని యట్టివాఁడవు
చింతల నీ కథలలోఁ జిక్కుకొంటివి
యెంతైనా నీ మహిమల నెంచరానివాఁడవు
దొంతర సహస్రనామాదుల నెన్ని కైతివి

(॥ఎక్కడ॥)
సరుగ నెవ్వరిచేత సాధింపరానివాఁడవు
వొరసి నీ భక్తిచే సాధ్యుండ వైతివి
సురలకు నీ గుఱుతు చూపరానివాఁడవు
బిరుదులచే గుఱుతు పెట్టించుకొంటివి

(॥ఎక్కడ॥)
వేదములచే నీరూపు వెదకరానివాఁడవు
పోదితో శ్రీవేంకటాద్రిఁ బౌడచూపేవు
యేదెస నీ వొక్కఁడవే యేలికైన వాఁడవు
మేదిని యలమేల్మంగ మెడఁ గట్టుకొంటివి

(||pallavi||)
ĕkkaḍa dām̐gam̐ga vachchu niṁka nīgunu
pakkana nī dāsu lĕllā bradigiri yiṁkanu

(||ĕkkaḍa||)
paṁtāna nĕkkaḍām̐ jikkuvaḍani yaṭṭivām̐ḍavu
siṁtala nī kathalalom̐ jikkugŏṁṭivi
yĕṁtainā nī mahimala nĕṁcharānivām̐ḍavu
dŏṁtara sahasranāmādula nĕnni kaidivi

(||ĕkkaḍa||)
saruga nĕvvariseda sādhiṁparānivām̐ḍavu
vŏrasi nī bhaktise sādhyuṁḍa vaidivi
suralagu nī guṟudu sūbarānivām̐ḍavu
birudulase guṟudu pĕṭṭiṁchugŏṁṭivi

(||ĕkkaḍa||)
vedamulase nīrūbu vĕdagarānivām̐ḍavu
podido śhrīveṁkaḍādrim̐ bauḍasūbevu
yedĕsa nī vŏkkam̐ḍave yeligaina vām̐ḍavu
medini yalamelmaṁga mĕḍam̐ gaṭṭugŏṁṭivi