Egguvattevu ganaga yidivo voyi

ఎగ్గువట్టేవు గనక యిదివో వోయి
Language

(॥పల్లవి॥)
ఎగ్గువట్టేవు గనక యిదివో వోయి
సిగ్గుతోడ నుండే నన్ను చిత్తగించవోయి

(॥ఎగ్గు॥)
మొగము చూచి నీకు మొక్కేనంటా రాఁగాను
నగవు వచ్చీవోయి నాసెలవుల
పగటుననే నీకు వాదాలొత్తేనంటా రాఁగా
జిగిఁ జెమటలు చేతఁ జిప్పిలీనోయి

(॥ఎగ్గు॥)
వేడుకతోడనీకు విడెమిచ్చేనంటా రాఁగా
తోడనే తమకములు తొలఁకీనోయి
వోడక నీపానుపుపై వొద్దనుడేనంటా రాఁగా
నీడలరెడుచేతులు నిన్నలమీనోయి

(॥ఎగ్గు॥)
మిక్కిలి నేనిన్నుఁ గూడి మెచ్చేనంటా రాఁగాను
పెక్కుపరవశములు పెరిగీనోయి
అక్కరైశ్రీవేంకటేశ అలమేలుమంగనేను
తొక్కరాఁగా నీపాదము తొలుతే మీఁదోయి

(||pallavi||)
ĕgguvaṭṭevu ganaga yidivo voyi
siggudoḍa nuṁḍe nannu sittagiṁchavoyi

(||ĕggu||)
mŏgamu sūsi nīgu mŏkkenaṁṭā rām̐gānu
nagavu vachchīvoyi nāsĕlavula
pagaḍunane nīgu vādālŏttenaṁṭā rām̐gā
jigim̐ jĕmaḍalu sedam̐ jippilīnoyi

(||ĕggu||)
veḍugadoḍanīgu viḍĕmichchenaṁṭā rām̐gā
toḍane tamagamulu tŏlam̐kīnoyi
voḍaga nībānububai vŏddanuḍenaṁṭā rām̐gā
nīḍalarĕḍusedulu ninnalamīnoyi

(||ĕggu||)
mikkili neninnum̐ gūḍi mĕchchenaṁṭā rām̐gānu
pĕkkubaravaśhamulu pĕrigīnoyi
akkaraiśhrīveṁkaḍeśha alamelumaṁganenu
tŏkkarām̐gā nībādamu tŏlude mīm̐doyi