Egguvattee nidiyeme yeedamdu

ఎగ్గువట్టీ నిదియేమే యీతఁడు
Language

(॥పల్లవి॥)
ఎగ్గువట్టీ నిదియేమే యీతఁడు
సిగ్గుపడ్డ నాలోని చింత లెంచవలదా

(॥ఎగ్గు॥)
మనసు చంచలమైతే మాటాడఁ గొలుపునా
నను పైనవిభుడేల నన్ను దూరీనే
తనువు కాఁక రేఁగితే దగ్గరి రాఁగొలుపునా
తనపనే చూచెఁగాని తగ వెంచవలదా

(॥ఎగ్గు॥)
పాయపువేఁకముచేతఁ బలుకఁగఁ గొలుపునా
చాయల సన్నల నేల సాదించీనే
రేయి విరహనఁబొంది రిచ్చఁజూడఁ గొలుపునా
నాయెడ రాజస మెంచి నన్ను నెంచవలదా

(॥ఎగ్గు॥)
కడుజెనుట నిండితే కాఁగిలించఁ గొలుపునా
బడివాసి యిప్పుడేల పైకొనీనే
అడరి శ్రీవేంకటేశుఁడాదరించి నన్నుఁగూడె
విడువ నిరతు లెంచి వేళ యెంచవలదా

(||pallavi||)
ĕgguvaṭṭī nidiyeme yīdam̐ḍu
siggubaḍḍa nāloni siṁta lĕṁchavaladā

(||ĕggu||)
manasu saṁchalamaide māḍāḍam̐ gŏlubunā
nanu painavibhuḍela nannu dūrīne
tanuvu kām̐ka rem̐gide daggari rām̐gŏlubunā
tanabane sūsĕm̐gāni taga vĕṁchavaladā

(||ĕggu||)
pāyabuvem̐kamusedam̐ balugam̐gam̐ gŏlubunā
sāyala sannala nela sādiṁchīne
reyi virahanam̐bŏṁdi richcham̐jūḍam̐ gŏlubunā
nāyĕḍa rājasa mĕṁchi nannu nĕṁchavaladā

(||ĕggu||)
kaḍujĕnuḍa niṁḍide kām̐giliṁcham̐ gŏlubunā
baḍivāsi yippuḍela paigŏnīne
aḍari śhrīveṁkaḍeśhum̐ḍādariṁchi nannum̐gūḍĕ
viḍuva niradu lĕṁchi veḽa yĕṁchavaladā