Eggulum dappulu nemchanemtige naagu

ఎగ్గులుఁ దప్పులు నెంచనేఁటికే నాకు
Language

(॥పల్లవి॥)
ఎగ్గులుఁ దప్పులు నెంచనేఁటికే నాకు
అగ్గలమై తనమేలు ఆతుమలో నుండును

(॥ఎగ్గు॥)
వెలి నెవ్వతెవద్ద వేడుకతో నుండినాను
తలఁపులోనే వుండుఁ దా నాకును
పలుకు లెవ్వరితోడఁ బలుకుతా నుండినాను
చెలఁగి తనమాట నాచెవి సోఁక వుండును

(॥ఎగ్గు॥)
నంటున నెవ్వరితోడనవ్వులు దా నవ్వినాను
అంటి నామోమునఁ గట్టినట్టే వుండును
దంటతనాన నెందెందు తప్పక తాఁ జూచినాను
సొంటులు సోదించి నన్నుఁ జూచినట్టే వుండును

(॥ఎగ్గు॥)
గక్కననేకాఁ(కాం?) తలఁ గాఁగిలించి కూడినాను
ఇక్కడ నన్నుఁ గూడిన ట్టింపైవుండును
యెక్కువ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నునేలినాఁడు
తక్కక సంతోసముదక్కినట్టె వుండును

(||pallavi||)
ĕggulum̐ dappulu nĕṁchanem̐ṭige nāgu
aggalamai tanamelu ādumalo nuṁḍunu

(||ĕggu||)
vĕli nĕvvadĕvadda veḍugado nuṁḍinānu
talam̐pulone vuṁḍum̐ dā nāgunu
palugu lĕvvaridoḍam̐ balugudā nuṁḍinānu
sĕlam̐gi tanamāḍa nāsĕvi som̐ka vuṁḍunu

(||ĕggu||)
naṁṭuna nĕvvaridoḍanavvulu dā navvinānu
aṁṭi nāmomunam̐ gaṭṭinaṭṭe vuṁḍunu
daṁṭadanāna nĕṁdĕṁdu tappaga tām̐ jūsinānu
sŏṁṭulu sodiṁchi nannum̐ jūsinaṭṭe vuṁḍunu

(||ĕggu||)
gakkananegām̐(kāṁ?) talam̐ gām̐giliṁchi kūḍinānu
ikkaḍa nannum̐ gūḍina ṭṭiṁpaivuṁḍunu
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannunelinām̐ḍu
takkaga saṁtosamudakkinaṭṭĕ vuṁḍunu