Eggulugaam batta kimka neevoo

ఎగ్గులుగాఁ బట్ట కిఁక నీవూ
Language

(॥పల్లవి॥)
ఎగ్గులుగాఁ బట్ట కిఁక నీవూ
అగ్గలిక చెల్లు నాఁటదానికి

(॥ఎగ్గు ॥)
కూరిమి గొసరి కొమ్మ నీమీఁదను
సారెకు వలపులు చల్లీ నదె
పేరుకొని యట్టె పిలిచీఁ గమ్మర
మేరతో నగఁదగు మేనదానికి

(॥ఎగ్గు॥)
అంట గాఁగిలించి ఆయాలు సోఁకఁగ
నంటున నీతో నవ్వీ నదె
వెంటవెట్టుకొని పెనఁగీ నింతలో
వెంట రా నమరు యింటిదానికి

(॥ఎగ్గు॥)
అట్టె నిన్నుఁ గూడి యలమేలుమంగ
రట్టుగా నాసలఁ బెట్టీ నదె
గట్టిఁగా శ్రీవేంకటేశుఁడ నీతో
గుట్టు దగు సేసుకొన్నదానికి

(||pallavi||)
ĕggulugām̐ baṭṭa kim̐ka nīvū
aggaliga sĕllu nām̐ṭadānigi

(||ĕggu ||)
kūrimi gŏsari kŏmma nīmīm̐danu
sārĕgu valabulu sallī nadĕ
perugŏni yaṭṭĕ pilisīm̐ gammara
merado nagam̐dagu menadānigi

(||ĕggu||)
aṁṭa gām̐giliṁchi āyālu som̐kam̐ga
naṁṭuna nīdo navvī nadĕ
vĕṁṭavĕṭṭugŏni pĕnam̐gī niṁtalo
vĕṁṭa rā namaru yiṁṭidānigi

(||ĕggu||)
aṭṭĕ ninnum̐ gūḍi yalamelumaṁga
raṭṭugā nāsalam̐ bĕṭṭī nadĕ
gaṭṭim̐gā śhrīveṁkaḍeśhum̐ḍa nīdo
guṭṭu dagu sesugŏnnadānigi