Eggubattevu ganaga yeravaa naagu

ఎగ్గుపట్టేవు గనక యెరవా నాకు
Language

(॥పల్లవి॥)
ఎగ్గుపట్టేవు గనక యెరవా నాకు
సిగ్గు విడిపించే నింతే చెల్లదా నాకు

(॥ఎగ్గు॥)
చెన్నుమీర నిన్ను సాము సేఇంచేకొరకుఁగాక
చన్నుల నొత్తక నీతో చలమా నాకు
తిన్నని నీగుణ మిట్టె దిద్దుకొనే మింతే కాక
పన్ని నిన్ను జంకించఁ బంతమా నాకు

(॥ఎగ్గు॥)
దక్కిన పెండ్లినాటి తగవు నేరిపేఁగాక
గక్కనఁ గాలు దాఁకించ గర్వమా నాకు
లక్కవలె గరఁగించి లావులు నెరపేఁగాక
పెక్కుమారులు వెనఁగ బిగువా నాకు

(॥ఎగ్గు॥)
యెంగిలి పొత్తు గలసి యెనసే కొరకుఁగాక
సంగతిగా మోవియ్య రాజసమా నాకు
కుంగక శ్రీ వేంకటేశ కూడితి మేలుకే కాక
అంగమెల్లా నలయించ నంతపగా నాకు

(||pallavi||)
ĕggubaṭṭevu ganaga yĕravā nāgu
siggu viḍibiṁche niṁte sĕlladā nāgu

(||ĕggu||)
sĕnnumīra ninnu sāmu seiṁchegŏragum̐gāga
sannula nŏttaga nīdo salamā nāgu
tinnani nīguṇa miṭṭĕ diddugŏne miṁte kāga
panni ninnu jaṁkiṁcham̐ baṁtamā nāgu

(||ĕggu||)
dakkina pĕṁḍlināḍi tagavu neribem̐gāga
gakkanam̐ gālu dām̐kiṁcha garvamā nāgu
lakkavalĕ garam̐giṁchi lāvulu nĕrabem̐gāga
pĕkkumārulu vĕnam̐ga biguvā nāgu

(||ĕggu||)
yĕṁgili pŏttu galasi yĕnase kŏragum̐gāga
saṁgadigā moviyya rājasamā nāgu
kuṁgaga śhrī veṁkaḍeśha kūḍidi meluge kāga
aṁgamĕllā nalayiṁcha naṁtabagā nāgu