Eggubattaraadu mari yerimgina jaanamdavu

ఎగ్గుపట్టరాదు మరి యెరిఁగిన జాణఁడవు
Language

(॥పల్లవి॥)
ఎగ్గుపట్టరాదు మరి యెరిఁగిన జాణఁడవు
సిగ్గరిది నీ దేవులు చిత్తగించవయ్యా

(॥ఎగ్గు॥)
కాంతలకు నొయ్యారపుగర్వమే బంగారము
వింతలైన మాటలవెంగేలు చవి
సంతోసపుఁజూపులసళుపులే మోహనము
మంతనాననుండి చల్లేమచ్చికలే యింపులు

(॥ఎగ్గు॥)
తగుఁ బయ్యెదచన్నులదాఁపరాలే తరితీపు
మొగములో చిరునవ్వు మొలకే ఆస
సొగసైన కరములసోఁకులే ఆనందాలు
పగటు బొమ్మజంకెలే భావజునిసిరులు

(॥ఎగ్గు॥)
సందడిచెనకులు సంసారఫలములు
కందువమోవిసన్నలు కడుఁ బండుగ
అందపు శ్రీవెంకటేశ అలమేల్ మంగకు నీకు
మందెమేళాలు రతులమర్మపు ముచ్చటలు

(||pallavi||)
ĕggubaṭṭarādu mari yĕrim̐gina jāṇam̐ḍavu
siggaridi nī devulu sittagiṁchavayyā

(||ĕggu||)
kāṁtalagu nŏyyārabugarvame baṁgāramu
viṁtalaina māḍalavĕṁgelu savi
saṁtosabum̐jūbulasaḽubule mohanamu
maṁtanānanuṁḍi sallemachchigale yiṁpulu

(||ĕggu||)
tagum̐ bayyĕdasannuladām̐parāle taridību
mŏgamulo sirunavvu mŏlage āsa
sŏgasaina karamulasom̐kule ānaṁdālu
pagaḍu bŏmmajaṁkĕle bhāvajunisirulu

(||ĕggu||)
saṁdaḍisĕnagulu saṁsāraphalamulu
kaṁduvamovisannalu kaḍum̐ baṁḍuga
aṁdabu śhrīvĕṁkaḍeśha alamel maṁgagu nīgu
maṁdĕmeḽālu radulamarmabu muchchaḍalu