Eggubattam baniledu yimtuladonu

ఎగ్గుపట్టఁ బనిలేదు యింతులతోను
Language

(॥పల్లవి॥)
ఎగ్గుపట్టఁ బనిలేదు యింతులతోను
సిగ్గువడ్డ కామిని చెక్కు చేతఁ జేర్చును

(॥ఎగ్గు॥)
పనిమాలినపనికి పంతముతో రమణుని
చనవుగలయాఁటది సాదించును
పెనఁగి బుద్దిచెప్పితే బిగియుచుఁ జెలులతో
వొనరనిసణఁగులు వూరకే రాలుచును

(॥ఎగ్గు॥)
పిలువకతొలుతే ప్రేమములు తానే చల్లి
బలిమిక తై యైనది పైకొనును
వలదన్నా విడువదు వడ్డి వారు చూడఁగానే
కొలఁదిమీర నతనిఁ గొంగువట్టి తీసును

(॥ఎగ్గు॥)
తడఁబడ దెంతైనా తాలిమి నిలుపలేక
కడుఁదమకించినది కాఁగిలించును
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
బడివాయఁకిఁక దాను పాలుపడివుండును

(||pallavi||)
ĕggubaṭṭam̐ baniledu yiṁtuladonu
sigguvaḍḍa kāmini sĕkku sedam̐ jersunu

(||ĕggu||)
panimālinabanigi paṁtamudo ramaṇuni
sanavugalayām̐ṭadi sādiṁchunu
pĕnam̐gi buddisĕppide bigiyusum̐ jĕlulado
vŏnaranisaṇam̐gulu vūrage rālusunu

(||ĕggu||)
piluvagadŏlude premamulu tāne salli
balimiga tai yainadi paigŏnunu
valadannā viḍuvadu vaḍḍi vāru sūḍam̐gāne
kŏlam̐dimīra nadanim̐ gŏṁguvaṭṭi tīsunu

(||ĕggu||)
taḍam̐baḍa dĕṁtainā tālimi nilubalega
kaḍum̐damagiṁchinadi kām̐giliṁchunu
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
baḍivāyam̐kim̐ka dānu pālubaḍivuṁḍunu