Eggu pattevu ganaga yegasekkemu laada needo

ఎగ్గు పట్టేవు గనక యెగసెక్కెము లాడ నీతో
Language

(॥పల్లవి॥)
ఎగ్గు పట్టేవు గనక యెగసెక్కెము లాడ నీతో
వెగ్గళించి పంతాలాడ వేడుకా నీతోను

(॥ఎగ్గు॥)
గోరు దాఁకి మేనిమీఁద కుమ్మెలు గాఁగాఁ గాక
సారె సారె జంకించఁ జలమా నీతోను
మారుకొని నీసుద్దులు మన నాటఁగాఁ గాక
కూరుములు గొసరఁగ కోపమా నీతోను

(॥ఎగ్గు॥)
తెగడఁగా మోవిదాఁకి తేనె చిందఁగాఁ గాక
పగలు సాదించ నాకుఁ బగటా నీతో
నిగిడి నా పయ్యద నీచేచుట్టుకోఁగాఁ గాక
అగడు చేసి మొరయ నదేపనే నీతోను

(॥ఎగ్గు॥)
దొమ్మి నీవు చేసితే నాతురుము జారఁగాఁ గాక
నిమ్మపంట వేయఁగ నేరుపా నీతో
ఇమ్ముల శ్రీ వేంకటేశ యేలితివి నీవు నన్ను
కమ్మరఁ గమ్మర నవ్వ గర్వమా నీతోను

(||pallavi||)
ĕggu paṭṭevu ganaga yĕgasĕkkĕmu lāḍa nīdo
vĕggaḽiṁchi paṁtālāḍa veḍugā nīdonu

(||ĕggu||)
goru dām̐ki menimīm̐da kummĕlu gām̐gām̐ gāga
sārĕ sārĕ jaṁkiṁcham̐ jalamā nīdonu
mārugŏni nīsuddulu mana nāḍam̐gām̐ gāga
kūrumulu gŏsaram̐ga kobamā nīdonu

(||ĕggu||)
tĕgaḍam̐gā movidām̐ki tenĕ siṁdam̐gām̐ gāga
pagalu sādiṁcha nāgum̐ bagaḍā nīdo
nigiḍi nā payyada nīsesuṭṭugom̐gām̐ gāga
agaḍu sesi mŏraya nadebane nīdonu

(||ĕggu||)
dŏmmi nīvu seside nādurumu jāram̐gām̐ gāga
nimmabaṁṭa veyam̐ga nerubā nīdo
immula śhrī veṁkaḍeśha yelidivi nīvu nannu
kammaram̐ gammara navva garvamā nīdonu