ఎగ్గు లేల తప్పు లేల యిందులోనే రమణుఁడ
(॥పల్లవి॥)
ఎగ్గు లేల తప్పు లేల యిందులోనే రమణుఁడ
నిగ్గుల మెఱుఁగులలోన నెర సున్నదా
(॥ఎగ్గు॥)
చిగురుమోవి గనక జిగి నల్లాడెనో కాక
మగువ నిను గొణఁగి మాటాడెనా
వొగిఁ గన్నుఁగలువలు మొగి విరియవో కాక
సొగసి నీతో నలిగి చూడ దాయనా
(॥ఎగ్గు॥)
తతిగాక ముఖచంద్రోదయము గాదో గాక
అతివ నీ కవ్వలిమోమై యుండెనా
సతి నవ్వువెన్నెలలు చకోరాలంటెనో కాక
పతి నీవు నవ్వఁగాను నవ్వకుండెనా
(॥ఎగ్గు॥)
బాహులత లటుగాను పైఁ బారెనో కాక
సాహసించి నీరతిలివి జవ మీరేనా
యీహల శ్రీవేంకటేశు యిటు నీవు గూడఁగాను
మోహపుగో రంటెను మొన చూసెనా
(||pallavi||)
ĕggu lela tappu lela yiṁdulone ramaṇum̐ḍa
niggula mĕṟum̐gulalona nĕra sunnadā
(||ĕggu||)
sigurumovi ganaga jigi nallāḍĕno kāga
maguva ninu gŏṇam̐gi māḍāḍĕnā
vŏgim̐ gannum̐galuvalu mŏgi viriyavo kāga
sŏgasi nīdo naligi sūḍa dāyanā
(||ĕggu||)
tadigāga mukhasaṁdrodayamu gādo gāga
adiva nī kavvalimomai yuṁḍĕnā
sadi navvuvĕnnĕlalu sagorālaṁṭĕno kāga
padi nīvu navvam̐gānu navvaguṁḍĕnā
(||ĕggu||)
bāhulada laḍugānu paim̐ bārĕno kāga
sāhasiṁchi nīradilivi java mīrenā
yīhala śhrīveṁkaḍeśhu yiḍu nīvu gūḍam̐gānu
mohabugo raṁṭĕnu mŏna sūsĕnā