Eggu lela pattevu yimdugu neevu

ఎగ్గు లేల పట్టేవు యిందుకు నీవు
Language

(॥పల్లవి॥)
ఎగ్గు లేల పట్టేవు యిందుకు నీవు
వెగ్గళించేనా నీతో వేడు కింతే కాక

(॥ఎగ్గు॥)
కలయు మనుచు నిన్ను కాఁకల నానలు వెట్టి
వలపు చల్లితిఁ గాక వాదడిచేనా
బలువుఁడవైన నీతో, పడఁతి నింతే నేను
చలము సాదించేనా చన వింతే కాక

(॥ఎగ్గు॥)
యింటికి రమ్మని నిన్ను యిటు నటు కొంగు వట్టి
నంటు చూపితిఁ గాక నాయమాడేనా
దంటవు నీ విన్నిటాను తగుముద్దరాల నేను
వెంట వెంట వచ్చేఁగాక వేసరించేనా

(॥ఎగ్గు॥)
మచ్చిక సరసమాడి మరి నీపైఁ జెయి వేసి
వచ్చి సేసే నింతేకాక పాడి దుప్పేనా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మెచ్చఁగలదానఁ గాక మేరలు మీరేనా

(||pallavi||)
ĕggu lela paṭṭevu yiṁdugu nīvu
vĕggaḽiṁchenā nīdo veḍu kiṁte kāga

(||ĕggu||)
kalayu manusu ninnu kām̐kala nānalu vĕṭṭi
valabu sallidim̐ gāga vādaḍisenā
baluvum̐ḍavaina nīdo, paḍam̐ti niṁte nenu
salamu sādiṁchenā sana viṁte kāga

(||ĕggu||)
yiṁṭigi rammani ninnu yiḍu naḍu kŏṁgu vaṭṭi
naṁṭu sūbidim̐ gāga nāyamāḍenā
daṁṭavu nī vinniḍānu tagumuddarāla nenu
vĕṁṭa vĕṁṭa vachchem̐gāga vesariṁchenā

(||ĕggu||)
machchiga sarasamāḍi mari nībaim̐ jĕyi vesi
vachchi sese niṁtegāga pāḍi duppenā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
mĕchcham̐galadānam̐ gāga meralu mīrenā