ఏకచిత్తమున నుండు యిదివో యాపె
(॥పల్లవి॥)
ఏకచిత్తమున నుండు యిదివో యాపె
చేకొనుము రమణుఁడ చింతదీరె నేఁడు
(॥ఏక॥)
పాసి నీతో సారె సారె పంతాలాడిన యోపె
వాసి దలఁచుకయైన వచ్చెఁగా నేఁడు
కాసు సేయని పనికి కన్నులఁ దిట్టినయాపె
ఆసలు వుట్టఁగ మాటలాడెఁగా నేఁడు
(॥ఏక॥)
దగ్గరక నిన్ను నట్టె తప్పులెంచినట్టి యాపె
వెగ్గళించి నీపైఁ జేయివేసెఁగా నేఁడు
వొగ్గి నీపనులకెల్ల వొడఁబడకుండినాపె
సిగ్గుదేర నిన్నుఁ దానే చెనకెఁగా నేఁడు
(॥ఏక॥)
మంచముమీఁదనే వుండి మాయలు నెరవినాపె
కొంచక నీకాఁగిటఁ గూడెఁగా నేఁడు
యెంచక శ్రీవేంకటేశ యెనసితి విఁక నాపె
మించి నిన్ను లోఁగొనె మేలుగా నేఁడు
(||pallavi||)
egasittamuna nuṁḍu yidivo yābĕ
segŏnumu ramaṇum̐ḍa siṁtadīrĕ nem̐ḍu
(||ega||)
pāsi nīdo sārĕ sārĕ paṁtālāḍina yobĕ
vāsi dalam̐sugayaina vachchĕm̐gā nem̐ḍu
kāsu seyani panigi kannulam̐ diṭṭinayābĕ
āsalu vuṭṭam̐ga māḍalāḍĕm̐gā nem̐ḍu
(||ega||)
daggaraga ninnu naṭṭĕ tappulĕṁchinaṭṭi yābĕ
vĕggaḽiṁchi nībaim̐ jeyivesĕm̐gā nem̐ḍu
vŏggi nībanulagĕlla vŏḍam̐baḍaguṁḍinābĕ
siggudera ninnum̐ dāne sĕnagĕm̐gā nem̐ḍu
(||ega||)
maṁchamumīm̐dane vuṁḍi māyalu nĕravinābĕ
kŏṁchaga nīgām̐giḍam̐ gūḍĕm̐gā nem̐ḍu
yĕṁchaga śhrīveṁkaḍeśha yĕnasidi vim̐ka nābĕ
miṁchi ninnu lom̐gŏnĕ melugā nem̐ḍu